Laxmi Puja Tips: ఇల్లుని ఇలా ఉంచుకోండి.. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మిదేవి అనుగ్రహంతో సిరిసంపదలకు లోటు ఉండదు..
కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ సందర్భంగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు.. ఉండకూడనివి ఏమిటో తెలుసుకుందాం.
జీవితంలో అవసరాలు తీర్చుకోవడానికి.. అన్ని రకాల సుఖ సంతోషాలను తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం. సంపద అధినేత లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నారిపై కాసుల వర్షం కురుస్తుంది. సుఖ సంపదలకు లోటు ఉంటుంది. కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ సందర్భంగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు.. ఉండకూడనివి ఏమిటో తెలుసుకుందాం.
లక్ష్మీదేవికి ఎందుకు కోపం వస్తుందంటే
- హిందువుల విశ్వాసం ప్రకారం శుభ్రత లేని పరిసరాలు, మురికి నిండిన ఇంట్లో సంపద అధిదేవత లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ సంపద, పర్సు , డబ్బును తప్పుడు చేతితో తాకిన వారిపై లక్ష్మీదేవి కోపంతో అక్కడ నుంచి వదిలి వెళ్తుంది.
- రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచరాదు. లేదా అంతేకాదు ఎంగిలి పాత్రలను కొందరు పొయ్యిపై ఉంచుతారు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో ధన, ధాన్యాల కొరత ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం.. తుడుచుకోవడంచేస్తే.. ఆ ఇంటి సభ్యులపై లక్ష్మీదేవి కోపంతో ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. అంతేకాదు అటువంటి వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉంటుంది.
లక్ష్మీదేవి ఎప్పుడు, ఎక్కడ నివసిస్తుందంటే..
- హిందూ విశ్వాసం ప్రకారం తమ ఇంట్లో స్వచ్ఛత, పరిశుభ్రతను కాపాడుకునేవారు సూర్యోదయానికి ముందే లేచే వారి పట్ల ఎల్లప్పుడూ సంపద దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉంటుంది.
- హిందూ విశ్వాసం ప్రకారం స్త్రీలను గౌరవించే, ఆవును ప్రత్యేకంగా పూజించే ఇంటిలో లక్ష్మిదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది.
- శ్రీ మహా విష్ణువు ప్రతిరోజు తులసిని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంటివైపు ఆకర్షితులవుతుందని నమ్ముతారు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి సోదరుడు శంఖం.. ఏ ఇంట్లో లక్ష్మీదేవి శంఖాన్ని పూజిస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంపదతో నిండి ఉంటుంది.
- కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుని, ప్రేమ, సామరస్యంతో కలిసి జీవించే ఇంటిలో లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)