Tirumala: తిరుమలలో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అనుమానం.. కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు..

చిన్నారి లక్షితపై చిరుత పంజాతో టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు చేపట్టిన వన్యమృగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో చిరుతలతో పాటు ఎలుగుబంట్లు కూడా కనిపిస్తున్నాయి. కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. చిన్నారి కౌశిక్‌పై చిరుత దాడి తర్వాత ఒకటి.. చిన్నారి లక్షితపై పంజా తర్వాత రెండు చిరుతలు చిక్కాయి.

Tirumala: తిరుమలలో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అనుమానం.. కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు..
TTD Special Security Arrangements
Follow us
Surya Kala

| Edited By: Vimal Kumar

Updated on: Sep 08, 2023 | 12:15 PM

గతంలో అప్పుడప్పుడు తిరుమల కాలినడక బాట, గెస్ట్ హౌస్ వద్ద వంటి ప్రాంతాల్లో కనిపించే వన్యమృగాలు.. ఎన్నడూ లేనివిధంగా గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. బాలుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి మరణానికి కారణం అయింది. దీంతో అలిపిరి , శ్రీవారి మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ కాలినడక మార్గాలు.. ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో టీటీడీ రంగంలోకి దిగింది. వన్యమృగాల రాకను అడ్డుకోవడనికి.. భక్తులలో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి అనేక చర్యలు చేపట్టింది.

చిన్నారి లక్షితపై చిరుత పంజాతో టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు చేపట్టిన వన్యమృగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో చిరుతలతో పాటు ఎలుగుబంట్లు కూడా కనిపిస్తున్నాయి. కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. చిన్నారి కౌశిక్‌పై చిరుత దాడి తర్వాత ఒకటి.. చిన్నారి లక్షితపై పంజా తర్వాత రెండు చిరుతలు చిక్కాయి. నామాలగవి ప్రాంత పరిసరాల్లో మొత్తం ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మరో రెండు చిరుతల్ని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చిరుత బోన్‌ దగ్గరికి వెళ్లినట్టే వెళ్లి పక్క నుంచి వెళ్లిపోయింది. ఓ ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఈ రెండింటిని బంధించాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

శేషాచలంలో ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై క్లారిటీ లేదు. అయితే ట్రాప్‌ కెమెరాల్లో మాత్రం చిరుతల సంచారంతో వాటి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఆపరేషన్‌ చిరుతలో దాదాపు వెయ్యి మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అవసరమైతే ట్రాప్‌ కెమెరాలు.. అధునాతన బోన్లతో పాటు స్టాఫ్‌ని పెంచాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని.. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామంటున్నారు టీటీడీ, ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతానికి భక్తులకు సెక్యూరిటీ ఇస్తూ కొండపైకి పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..