Vaikunta Ekadashi: బియ్యం గింజపై రామ నామ లిఖిత యజ్ఞం నేడు అంకురార్పణ.. రాములోరి కల్యాణంలో తలంబ్రాలకు సమర్పణ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అయితే తూర్పుగోదావరి జిలా గొల్లమామిడాడలో రామ నామ లిఖిత యజ్ఞం అంకురార్పణ చేశారు సూక్ష్మ కళాకారుడు. 

Vaikunta Ekadashi: బియ్యం గింజపై రామ నామ లిఖిత యజ్ఞం నేడు అంకురార్పణ.. రాములోరి కల్యాణంలో తలంబ్రాలకు సమర్పణ
Sri Rama Name On The Rice
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 2:45 PM

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అయితే తూర్పుగోదావరి జిలాల్లోని ప్రముఖ దేవాలయం గొల్లమామిడాడలో రామ నామ లిఖిత యజ్ఞం అంకురార్పణ చేశారు.

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకుడు లయన్ ద్వారంపూడి యువ రాజారెడ్డి తలంబ్రాల బియ్యపు గింజలపై శ్రీరామ నామ లిఖిత మహా యజ్ఞాని కి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం గొల్లల మామిడాడ లో శ్రీ కోదండ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాలలో తలంబ్రాలుగా శ్రీరామ అనే నామాన్ని లిఖించిన బియ్యపు గింజలను తలంబ్రాలుగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

గత 13 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి రోజున ఈ మహా జ్ఞానికి అంకురార్పణ చేసి శ్రీరామనవమి వరకు రామ నామాన్ని మార్కర్ పెన్ను సహాయంతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో శ్రీ రామ నామాన్ని రాసి.. సీతారాముల కల్యాణానికి సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ అనంతరం భక్తిశ్రద్ధలతో నిష్టగా ఈ తలంబ్రాలపై శ్రీరామ నామాన్ని రాయడం జరుగుతుందని యువ రాజారెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..