Chanakya Niti: ఈ విషయాలను పొరపాటున కూడా భార్య సహా ఎవరికీ చెప్పొద్దు.. రహస్యంగా ఉంచమంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి నడవడికతో పాటు.. జీవన విధానాన్ని కూడా పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలని.. పొరపాటున కూడా భార్య సహా ఎవరికీ చెప్పవద్దని తెలిపారు.   

Chanakya Niti: ఈ విషయాలను పొరపాటున కూడా భార్య సహా ఎవరికీ చెప్పొద్దు.. రహస్యంగా ఉంచమంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2023 | 9:23 PM

ఆచార్య చాణక్యుడి విధానాలు నేటి కాలంలో కూడా ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన నీతి చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరంగా వివరించాడు. వీటిని పాటించడం వలన మనిషి జీవితం బాగుపడటమే కాకుండా ప్రతి దశలోనూ విజయాన్ని అందుకుంటాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి నడవడికతో పాటు.. జీవన విధానాన్ని కూడా పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలని.. పొరపాటున కూడా భార్య సహా ఎవరికీ చెప్పవద్దని తెలిపారు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం..  ఈ విషయాలు బహిరంగమైతే.. ఆ వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా..  తన జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఇవి కూడా చదవండి
  1. చాణక్య విధానం ప్రకారం ఇంట్లోని లోటుపాట్లు బయట పెడితే ఆ కుటుంబం పరువు పోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఎటువంటి సందర్భంలోనైనా వివాదాలకు ఇంటి సభ్యుల మధ్యే పరిష్కరించుకోండి. ఇంటిలోని వివాదాలు ఇతరులకు చెప్పడం ద్వారా శత్రువులు వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
  2. చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన..  నిరూపితమైన ఔషధాల పూర్తి సమాచారాన్ని ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచాలి. ఈ మందులు ఇతరుల చికిత్సలో సహాయపడతాయి. సిద్ధ ఔషధాల గురించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు.
  3. ఏ వ్యక్తి అయినా సరే తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే.. వాటిని ఎవరికీ చెప్పకూడదని చాణక్య విధానం చెబుతోంది.
  4. మరోవైపు, ఎవరైనా మిమ్మల్ని అవమానించినట్లయితే.. ఆ విషయం కూడా ఎవరికీ చెప్పకూడదు. దీని వల్ల ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
  5. ఒక వ్యక్తి తన వయస్సును ఎవరికీ చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని మీ వయసు అడిగితే, మీరు దీని గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వకూడదని చాణుక్యుడు పేర్కొన్నాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)