Success Mantra: మనిషి జీవితానికి సోమరితనానికి మించిన శత్రువు లేడు.. బద్ధకాన్ని వదిలించుకునే ఐదు చిట్కాలు మీకోసం

విజయానికి చేసే పయనంలో మొదటి అడ్డంకి సోమరితనం రూపంలో వస్తుంది. మనిషికి సోమరితనానికి మించిన శత్రువు మరొకడు లేడని అంటారు. ఇది ఒక లోపం.. సోమరితనం ఉన్న వ్యక్తి జీవితంలో పతనం ప్రారంభమవుతుంది.

Success Mantra: మనిషి జీవితానికి సోమరితనానికి మించిన శత్రువు లేడు.. బద్ధకాన్ని వదిలించుకునే ఐదు చిట్కాలు మీకోసం
Quotes On Lazy Laziness
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2022 | 4:05 PM

ప్రతి ఒక్కరూ జీవితంలో సుఖ సంతోషాల గురించి కలలు కంటారు. అయితే సంతోషం అనేది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. తాను తన జీవితంలో సుఖ సంతోషాలతో జీవితంచడానికి కష్టపడాల్సి ఉంటుంది. చెమట చిందించాల్సి ఉంటుంది. జీవితానికి సంబంధించిన ఏ కలను నెరవేర్చుకోవాలన్నా, ఏదైనా భారీ లక్ష్యాన్ని సాధించాలన్నా.. అత్యధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే విజయానికి చేసే పయనంలో మొదటి అడ్డంకి సోమరితనం రూపంలో వస్తుంది. మనిషికి సోమరితనానికి మించిన శత్రువు మరొకడు లేడని అంటారు. ఇది ఒక లోపం.. సోమరితనం ఉన్న వ్యక్తి జీవితంలో పతనం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలోని విలువైన సమయాన్ని కోల్పోయే సమయంలో ఎల్లప్పుడూ దుఃఖం, పేదరికంతో అల్లాడతాడు. కనుక మనిషి ఎదుగుదలకు అడ్డంకి అయిన సోమరితనాన్ని నివారించడానికి.. ఈ సక్సెస్ సూత్రాల గురించి తెలుసుకోండి.

  1. సోమరితనం లేదా ఇతర విషయాలలో తన సమయాన్ని వృధా చేసే వ్యక్తి.. తన పతనాన్ని తానే ఆహ్వానించినట్లు. సోమరితనం .. అతని జీవితాన్ని నాశనం చేస్తుంది.
  2. జీవితంలో ప్రతి రోగానికి ఏదో ఒక ఔషధం ఉంటుంది. అయితే మనిషి పేదరికానికి సోమరితనం కూడా తోడైతే.. ఇక ఆ వ్యాధికి మందు లేదు.
  3. ప్రతి మనిషికి ఏదో ఒక పని ఉంటుంది.. అయితే తనకు దొరికిన పనిని చేయాలన్న ఆలోచన లేనప్పుడు అతనిలో బద్ధకం ప్రబలుతుంది.
  4. ఒక వ్యక్తి జీవితంలో సరైన దినచర్య లేకపోవడం కూడా సోమరితనానికి కారణం అవుతుంది. కనుక జీవితంలో సరైన దినచర్యను ఏర్పాటు చేసుకోవాలి.. లేదంటే..  సోమరితనం దినచర్యలో భాగంగా చేసుకుని నిరాశతో గడిపేస్తుంటారు కొందరు
  5. ఇవి కూడా చదవండి
  6. ఎవరి మనస్సులో సోమరితనం అనే పురుగు ప్రవేశించిందో..  అతను తన స్వంత ఆసక్తిని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు, అటువంటి పరిస్థితిలో అతను ఇతరుల ఆసక్తిని .. కష్టాలను, పని చేసే సామర్ధ్యాన్ని  అర్ధం చేసుకోవడం అత్యంత కష్టం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)