Basha Shek |
Updated on: Mar 29, 2023 | 9:50 AM
పిల్ల జమీందార్ ఫేం హరిప్రియ, ప్రముఖ విలన్ వశిష్ఠ సింహా కొన్ని రోజుల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జనవరి 26న హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లిపీటలెక్కారు.
పెళ్లి తర్వాత వశిష్ఠ సింగ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ఇందుకోసం ఆయన తెలంగాణలోనే ఉన్నారు. తాజాగా హరిప్రియ కూడా తెలంగాణకు వచ్చేసి భర్తకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఈ సందర్భంగా తన సతీమణి కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలను ప్రిపేర్ చేయించాడు వశిష్ట సింహా. అనంతరం తన భార్యతో కలిసి భోజనం చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా హరిప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
ఇటీవలే హరిప్రియ వశిష్ఠ సింహతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంది. పెళ్లయిన తర్వాత వచ్చే మొదటి పండుగ కావడంతో ఇద్దరూ గ్రాండ్‌గా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.