Dairy Farmers Protest: రోడ్లపై పాలు పోసి పాడి రైతుల వినూత్న నిరసన.. అన్ని చోట్ల ఇదే తంతు..

పాలసేకరణ ధరలు పెంచాలంటూ రాష్ట్ర పాడి రైతులు రోడ్డెక్కారు. గేదెలలతోపాటు రైతులు రోడ్లపైకి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. పాలను కేన్లు, బకెట్‌లలో తీసుకొచ్చి రోడ్లపై దొర్లించి వినూత్నంగా నిరసన తెలిపారు. పాల ధరల..

Dairy Farmers Protest: రోడ్లపై పాలు పోసి పాడి రైతుల వినూత్న నిరసన.. అన్ని చోట్ల ఇదే తంతు..
Dairy Farmers Protest
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 20, 2023 | 4:20 PM

పాలసేకరణ ధరలు పెంచాలంటూ తమిళనాడు పాడి రైతులు రోడ్డెక్కారు. గేదెలతోపాటు రైతులు రోడ్లపైకి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. పాలను కేన్లు, బకెట్‌లలో తీసుకొచ్చి రోడ్లపై దొర్లించి వినూత్నంగా నిరసన తెలిపారు. పాల ధరల పెంచేవరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ఈ మేరకు తమిళనాడులోని ఈరోడ్డులో మార్చి17న పాడి రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. కాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాడి రైతులు ప్రభుత్వం నిర్వహిస్తోన్న అవిన కార్యక్రమం ద్వారా పాలు విక్రయిస్తుంటారు. లీటరు ఆవు పాలకు ఇప్పటి వరకు రూ.42లకు, గేదె పాలకు రూ.51 చొప్పున విక్రయిస్తున్నారు. ఐతే ప్రస్తుతం ఉన్న రేట్లకు లీటరుపై రూ.7 పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పశువుల దాణాకు 50 శాతం సబ్సిడీ కూడా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే పాల ఉత్పత్తిదారులు ప్రైవేటు కంపెనీల బాట పడుతున్నారని, ప్రయివేటు సంస్థలు లీటరు పాలను రూ.45 నుంచి 47కు కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు.

మదురైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా డెయిరీ రైతులు తమ ఆవులను వెంట తెచ్చుకుని రోడ్లపై చేరుకుని ఇదే విధంగా నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పాడి రైతుల నిరసనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల ధరలు పెంచాలని డిమాండ్‌ చేయడం సబబేగానీ, ఇలా పాలను తీసుకొచ్చి రోడ్డుపై వృద్ధాగా పారబోయడం సరికాదన్నారు. గుక్కెడు పాలకోసం నిత్యం వేలాది మంది అల్లాడిపోతున్నారు. అంత విలువైన పాలను నేలపాలు చేసి నిరసన తెలపడం సరికాదని మండిపడుతున్నారు. కాగా ప్రస్తుతం తమిళనాట పాడి రైతుల నిరసన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.