Honour Killing: నడి రోడ్డుపై చెల్లెలి భర్తను నిరికి చంపిన బావ.. కారణం ఏంటంటే..

మరో పరువుహత్య చోటుచేసుకుంది. తల్లిదండ్రుల అనుమతిలేకుండా యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ యువకుడిని మంగళవారం (మార్చి 21) అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ దారుణ ఘటన..

Honour Killing: నడి రోడ్డుపై చెల్లెలి భర్తను నిరికి చంపిన బావ.. కారణం ఏంటంటే..
Honour Killing
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 21, 2023 | 5:00 PM

తమిళనాడులో మరో పరువుహత్య చోటుచేసుకుంది. తల్లిదండ్రుల అనుమతిలేకుండా యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ యువకుడిని మంగళవారం (మార్చి 21) అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా కిట్టంబట్టి గ్రామానికి చెందిన జగన్ (28) స్థానికంగా టైల్స్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. కృష్ణగిరి జిల్లా అవధానపట్టి సమీపంలోని తులక్కన్ కోటాయి ప్రాంతానికి చెందిన శంకర్ కుమార్తె శరణ్యతో గత కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపించాడు. నెల రోజుల క్రితం జగన్‌, శరణ్యలు పెద్దల అనుమతిలేకుండానే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి తరపు బంధువులు జగన్‌ను మట్టుపెట్టేందుకు పథకం పన్నారు.

ఈ రోజు మధ్యాహ్నం జగన్ టైల్స్ పని నిమిత్తం కిట్టంబట్టి నుంచి కావేరీపట్నంకు బైక్‌పై వెళ్తున్నాడు. శరణ్య అన్న అయిన శంకర్‌, ఇతర బంధువులు రోడ్డుపై మార్గం మధ్యలో కేఆర్‌పీ డ్యామ్‌ సమీపంలో జగన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కత్తితో జగన్‌ గొంతు కోశారు. దీంతో జగన్ అక్కడికక్కడే మృతి చెందాడు. జగన్‌ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత శంకర్‌, అతనితోపాటు వచ్చిన బంధువులు పరారయ్యారు. సమాచారం అందుకున్న కావేరిపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జగన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. జగన్‌ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.