ఐరాస భద్రత మండలిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ లేకుండా ఎలా అంటూ ప్రశ్న

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద దేశాల ఎదుగుదలకు భారత్ ఓ లాంటిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా దేశంగా ఉన్న భారత్ చాలా ముఖ్యమైనది.. భారత్ లేకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పరిపూర్ణం కాదని వెల్లడించారు.

ఐరాస భద్రత మండలిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ లేకుండా ఎలా అంటూ ప్రశ్న
PM Modi
Follow us

|

Updated on: Jul 13, 2023 | 2:51 PM

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద దేశాల ఎదుగుదలకు భారత్ ఓ లాంటిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా దేశంగా ఉన్న భారత్ చాలా ముఖ్యమైనది.. భారత్ లేకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పరిపూర్ణం కాదని వెల్లడించారు. ఫ్రాన్స్ నేషనల్ డే సెలబ్రేషన్ల్ సందర్భంగా మోదీ ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు ముందు ప్రధాని ప్రముఖ ఫ్రెంచ్ డెయిలీ లెస్ ఎకోస్‌తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై నుంచి ఇండియా పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేశారు.

అలాగే ఎక్కువ జనాభా.. అతిపెద్ద ప్రజాస్వామ్యం గల ఇండియా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాగలదని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమతి భద్రతా మండలిలో ఎటువంటి మార్పులు జరగాలి.. అలాగే ఇటువంటి వాటి కోసం ఎలాంటి పాత్రను పోషిస్తే బాగుటుంది అన్న విషయాలపై ఇండియాతో సహా ఎన్నో దేశాలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి