Anurag Thakur: ఆహా..! అద్భుతం.. 14,000 అడుగుల ఎత్తులో చేతిపంపు నుంచి జలధార.. బోరు నీటిని తాగిన కేంద్ర మంత్రి..

Anurag Thakur Handpump Video: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో అతను చేతి పంపు కొడుతూ కనిపించారు. కేంద్ర మంత్రికి దాహం వేయడంతో, ఆ తర్వాత చేతి పంపును కొట్టుకుని మంచినీళ్లు తాగారు. ఈ చేతిపంపు మనాలి-లేహ్ హైవేపై 14000 అడుగుల ఎత్తులో డెబ్రింగ్ గ్రామంలో ఉంది. వీడియో చూడండి

Anurag Thakur: ఆహా..! అద్భుతం.. 14,000 అడుగుల ఎత్తులో చేతిపంపు నుంచి జలధార.. బోరు నీటిని తాగిన కేంద్ర మంత్రి..
Anurag Thakur
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2023 | 12:31 PM

Anurag Thakur Drinking Water From Handpump: లడఖ్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంశాలను తన ట్వీట్ ద్వారా షేర్ చేశారు. బుధవారం మనాలి లేహ్ హైవేపై డెబ్రింగ్ గ్రామంలో స్థానికులతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన చేతి పంపును కొట్టారు. బోర్ పంపు నుంచి వచ్చిన నీటిని తాగి ఆహా..! అంటూ ఆస్వాధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో, అతను చేతి పంపును కొట్టడం.. ఆ నీటిని తాగడం.. అద్భుతం అంటూ చెప్పడం మనం ఆ వీడియోలో చూడవచ్చు. ఈ చేతిపంపులు 14,000 అడుగుల ఎత్తులో ఉంది. మనాలి-లేహ్ హైవేపై ఉన్న డెబ్రింగ్ గ్రామంలో ఆయన పర్యటించారు. అక్కడి గ్రామస్థులతో ముచ్చటించారు. ఈ వీడియోను ట్వీట్ చేయడంతో పాటు, హ్యాండ్ పంప్ కొట్టుకుని మంచినీళ్లు తాగడం భిన్నమైన అనుభూతిని కలిగించిందని కేంద్ర మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోను 11 వేల మందికి పైగా లైక్ చేయగా, 1500 మందికి పైగా రీట్వీట్ చేశారు.

అంతకుముందు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. భారత్ అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి అని అన్నారు. దాని రక్షణ దళాలు, వ్యవస్థలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. లడఖ్‌లో తన రెండు రోజుల పర్యటన చివరి రోజున, సమాచార, ప్రసార మంత్రి భారత్ -చైనా సరిహద్దు సమీపంలోని చుమూర్ ప్రాంతంలో సైన్యం,  ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బందితో పాటు స్థానిక ప్రజలతో సంభాషించారు.

సరిహద్దుల రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందున్నారు. లడఖ్ ప్రజలు బాహ్య ప్రభావాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. లేహ్ నుంచి 211 కిమీ దూరంలోని కర్జోక్ గ్రామంలో ITBP సిబ్బందితో పరస్పర చర్చ సందర్భంగా, భారతదేశాన్ని మరింత బలమైన, మెరుగైన దేశంగా మార్చడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందని, బలమైన (రక్షణ) దళాలకు బలమైన ప్రభుత్వం మద్దతునిస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో భారత్‌ ఒకటి.

భద్రతా బలగాల ధైర్యాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి.. వారి దృఢ సంకల్పం వల్లే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని అన్నారు. సాయుధ దళాలకు చెందిన మూడు విభాగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం