ఎందుకమ్మా ఇలా చేశావ్.. భర్తతో గొడవ పడి.. నలుగురు పిల్లలతో బావిలోకి దూకిన మహిళ.. చివరకు..
బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ కుమార్ తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
భర్తతో గొడవ అనంతరం.. ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతిచెందారు. మహిళతోపాటు.. పెద్ద కుమార్తె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలను బావిలోకి నెట్టి.. ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె నీటిలో దూకగానే.. ప్రాణ భయంతో బావిలోని తాడును పట్టుకుంది. ఆమెతోపాటు.. తన పెద్ద కుమార్తెను తాడు సహాయంతో ప్రాణాలను కాపాడుకుంది. అయితే.. ఈ ఘటనలో ఇద్దరు కుమార్తెలు సహా 18 నెలల కుమారుడు మరణించాడు.
బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ కుమార్ తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రమీలా భిలాలా అనే మహిళ తన భర్త రమేశ్‌తో గొడవపడిన తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. ప్రమీల ఇంటికి సమీపంలో ఉన్న బావిలో నుంచి ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ప్రమీల, ఏడేళ్ల కుమార్తె పరిస్థితి బాగానే ఉందని.. చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..