Corona Virus: దేశంలో XBB.1.16 వేరియంట్.. కోవిడ్ మళ్ళీ విధ్వసం సృష్టిస్తుందా.. వ్యాప్తి నిరోధానికి కేంద్రం సన్నాహాలు..

కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధతను తనిఖీ చేయడానికి వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వార్తలు వచ్చాయి. ఇందులో అన్ని రాష్ట్రాల్లో యంత్రాలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సిబ్బంది, ఆక్సిజన్ సరఫరా వంటి ఏర్పాట్లను తనిఖీ చేస్తారు.

Corona Virus: దేశంలో  XBB.1.16 వేరియంట్.. కోవిడ్ మళ్ళీ విధ్వసం సృష్టిస్తుందా.. వ్యాప్తి నిరోధానికి కేంద్రం సన్నాహాలు..
Coronavirus
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2023 | 8:21 AM

భారతదేశంలో మరోసారి కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళల రేకెత్తిస్తోంది. రోజు రోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో.. ఈ వైరస్ గురించి కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ సలహా ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాలుగుT లపై పనిచేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ నాలుగు Tలలో టెస్ట్, ట్రాక్, ట్రీట్.. వ్యాక్సినేట్ ఉన్నాయి. వాస్తవానికి..  శనివారం విడుదల చేసిన కరోనా వైరస్ డేటా ప్రకారం  దేశవ్యాప్తంగా 1590 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24 గంటల్లో ఈ వైరస్ కారణంగా 6 మంది మరణించారు.

146 రోజుల్లో ఇదే అత్యధికం. మరోవైపు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత కొన్ని వారాల్లో కరోనా కేసులు 9 శాతం వరకు పెరిగాయి. కరోనా  XBB.1.16 వేరియంట్ కారణంగా ఈ సంఖ్యలు ఆకస్మికంగా పెరిగాయని పేర్కొన్నారు.  కరోనా గత వేరియంట్ కంటే ఈ కోవిడ్ వేరియంట్‌ చాలా వేగంగా వ్యాపిస్తుందని తెలియపరు. అందుకనే చాలా రాష్ట్రాల్లో  కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు వార్తలు తెరపైకి వస్తున్నాయి.

కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధతను తనిఖీ చేయడానికి వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వార్తలు వచ్చాయి. ఇందులో అన్ని రాష్ట్రాల్లో యంత్రాలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సిబ్బంది, ఆక్సిజన్ సరఫరా వంటి ఏర్పాట్లను తనిఖీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌లు జరిగాయి. కొన్ని రాష్ట్రాల మినహా అన్ని చోట్ల తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

టెస్ట్ ట్రాక్ కంటే చికిత్స సులభం

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఇప్పుడు కరోనా పరీక్షకు సంబంధించిన పూర్తి ఖాతా ఉంది దీంతో కరోనా సోకిన వ్యక్తిని ట్రాక్ చేయడం చాలా సులభం అయింది. అయితే ఇలా ట్రాక్ చేయాలంటే.. కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ట్రాక్ చేయడం కష్ట తరం. కనుకనే ప్రభుత్వం ముందుగా పరీక్షపై దృష్టిపెట్టి ఆపై ట్రాక్‌పై దృష్టి సారిస్తోంది. దీని తరువాత కోవిడ్ సోకిన వ్యక్తులకు సరైన చికిత్స అందించడం సులభం.

బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహించింది. ప్రభుత్వం బూస్టర్ డోస్‌ను ప్రోత్సహించే అనేక కార్యక్రమాలను అమలు చేసింది. భారతీయ వ్యాక్సిన్‌లు ఇప్పటివరకు వచ్చిన అన్ని రకాల కరోనాలపై పూర్తిగా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని  ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఒక ప్రకటన విడుదల చేశారు. అందుకే కరోనా వ్యాప్తి గురించి భయపడాల్సిన అవసరం లేదని, అయితే ఈ సమయంలో ప్రజలు ఖచ్చితంగా  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..