Women’s World Boxing Championships: బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో తెలుగు తేజం నిఖత్… భారత్‌కు 4 రజత పతకాలు ఖాయం

ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి . గురువారం జరిగిన సెమీ ఫైనల్ బౌట్‌లలో నిఖత్ జరీన్, నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా సహా ఒలింపిక్ పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తమ తమ వెయిట్ కేటగిరీలలో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు.

Women’s World Boxing Championships: బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో తెలుగు తేజం నిఖత్... భారత్‌కు 4 రజత పతకాలు ఖాయం
Nikhat Zareen
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2023 | 8:33 AM

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ సత్తా చాటుతోంది. సెమీఫైనల్‌లో కొలంబియన్‌ బాక్సర్‌ ఇంగ్రిత్‌ లొరెనా వాలెన్షియా విక్టోరియాపై 5-0 తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి . గురువారం జరిగిన సెమీ ఫైనల్ బౌట్‌లలో నిఖత్ జరీన్, నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా సహా ఒలింపిక్ పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తమ తమ వెయిట్ కేటగిరీలలో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రీడాకారిణిలు అందరూ సెమీ-ఫైనల్‌కు చేరుకుని ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్నారు. నీతూ, స్వీటీల ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుండగా.. ఆదివారం లోవ్లినా, నిఖత్ టైటిల్ కోసం పోటీపడనున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్ నిఖత్‌ జరీన్‌ 50 కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌లో కొలంబియాకు చెందిన ఇంగ్రిత్‌ లొరెనాపై 5-0 తేడాతో విజయం సాధించింది. వాలెన్షియా 2016 రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత. నిఖత్ మాట్లాడుతూ.. “నేటి మ్యాచ్ అత్యుత్తమంగా సాగింది. తాను సాంకేతికంగా మంచి బాక్సర్లతో పోరాడినప్పుడు మెరుగ్గా రాణిస్తానని తాను భావిస్తున్నానని చెప్పింది. తాను గతంలోనే  ఇంగ్రిత్‌ తో తలపడ్డానని.. ఆమె చాలా అనుభవం ఉన్న బాక్సర్ అని చెప్పింది.

తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న లోవ్లినా  రెండుసార్లు కాంస్య పతక విజేత లోవ్లినా చైనాకు చెందిన లీ కియాన్‌పై 4-1 తేడాతో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లోవ్లినా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఆదివారం బంగారు పతకం కోసం లోవ్లినా ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్క్‌తో తలపడనుంది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్యూ అమ్మన్ గ్రీన్‌ట్రీపై 4-3 తేడాతో గెలిచిన స్వీటీ కూడా చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ లీనాతో స్వీటీ తలపడనుంది.

గతేడాది ప్రతీకారం తీర్చుకున్న నీతు  సెమీ ఫైనల్స్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలువా బల్కిబెకోవాతో నీతు ఘంఘాస్ తలపడింది. గతేడాది ఈ బాక్సర్ చేతిలో నీతు ఓడిపోయింది. ఇక్కడ విభజన నిర్ణయం ఆధారంగా నీతూ  5-2తో గెలిచింది. అంతకుముందు నీతూ, బల్కిబెకోవా మధ్య జరిగిన మ్యాచ్ గతేడాది జరిగిన క్వార్టర్ ఫైనల్ తరహాలోనే జరిగింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి రౌండ్‌లో ఇద్దరు ఆటగాళ్లు భీకరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రౌండ్‌లో అలువా 3-2తో గెలిచింది. అనంతరం నీతు రెండో రౌండ్‌లో పుంజుకుని తన అద్భుతమైన పంచ్‌తో విరుచుకుపడింది. మ్యాచ్ ముగిశాక రివ్యూ తీసుకున్న నీతూను విజేతగా ప్రకటించారు. నీతు తదుపరి శనివారం ఆసియా ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..