ISRO: ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి.. శ్రీహరికోట నుంచి LVM3-M3 రాకెట్‌ ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది.

ISRO: ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి.. శ్రీహరికోట నుంచి LVM3-M3 రాకెట్‌ ప్రయోగం..
Isro
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 26, 2023 | 8:22 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. మరికాసేపట్లో LVM3-ఎం3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్ లో 9గంటలకు ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువున్న రాకెట్‌ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. 36 ఉపగ్రహాలను 19.7 నిమిషాల్లో కక్ష్యలోకి పంపనున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 150 కిలోగ్రాములు.. 12 వాహననౌక ద్వారా ఇస్రో కక్ష్యలోకి పంపనుంది. భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహలు తిరగనున్నాయి.

ఈ ప్రయోగం కోసం ఇస్రో లాంచ్‌ వెహికల్‌ పేరు మార్చంది. బ్రిటన్‌ నుంచి రూ.1000 కోట్ల కాంట్రాక్ట్‌ సంపాదించింది. అయితే.. రష్యాకు చెందిన సోయుజ్‌ ద్వారా పంపాలని గతంలో ఒప్పందం చేసుకుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా రష్యాతో అంతరిక్ష ఒప్పందాలను బ్రిటన్ రద్దు చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందించేలా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అక్టోబర్‌ 23, 2022న 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో.. వన్‌వెబ్‌- భారతి గ్లోబల్‌, ఫ్రాన్స్‌ సంస్థ యూటెల్‌శాట్‌ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో బ్రిటన్‌ ప్రభుత్వం, జపాన్‌ సాఫ్ట్ బ్యాంకు వాటాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..