Caste Discrimination: కోరలు చాస్తోన్న కుల వివక్ష.. వారికి ఆలయంలోకి ప్రవేశం లేదంటూ అడ్డుకున్న పోలీసులు
తెంకాసి జిల్లా శంకరన్ కోవిల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి.. ఓ వర్గాన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం కలకలం రేపింది. అయితే, ఆ పనిచేసింది వ్యతిరేక వర్గమేం కాదు. ఏకంగా పోలీసులు వారిని అడ్డుకోవడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అమ్మవారి ఆలయప్రవేశంపై కొన్నేళ్లుగా రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
మనిషి సాంకేతికంగా అంతరిక్షం దాకా వెళ్లగలిగాడు గానీ.. ఇంకా కులాల కంచెల్ని మాత్రం దాటలేకపోతున్నాడు. అలాంటి ఓ సంఘటనే తమిళనాడులో తాజాగా వెలుగుచూసింది. తెంకాసి జిల్లా శంకరన్ కోవిల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి.. ఓ వర్గాన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం కలకలం రేపింది. అయితే, ఆ పనిచేసింది వ్యతిరేక వర్గమేం కాదు. ఏకంగా పోలీసులు వారిని అడ్డుకోవడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అమ్మవారి ఆలయప్రవేశంపై కొన్నేళ్లుగా రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఈ అంశంలో అందరూ సమానమేననీ.. ప్రతిఒక్కరికీ ఆలయ ప్రవేశం ఉంటుందనీ.. మధురై హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో, ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు వీరనాపురం గ్రామస్థులు వచ్చారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకోవడం గొడవకు దారితీసింది. ఆలయంలోకి ప్రవేశం లేదంటూ పోలీసులు.. కోర్టు ఆర్డర్ అంటూ గ్రామస్థులు.. వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు – పోలీసులు మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు.. గ్రామస్థుల్ని అరెస్ట్ చేశారు.
కలెక్టర్ సీరియస్..
కుల వివక్షతతో ఓ వర్గాన్ని ఆలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం పట్ల.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. మ్యాటర్ సీరియస్ కావడంతో.. ఘటనపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. కాగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. వీటిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మాత్రం చైతన్యం రావడం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..