IPL 2023: చిన్నపిల్లాడిలా మారిపోయిన ధోని.. లక్నోప్లేయర్‌ కూతురితో ఎలా ఆడుకుంటున్నాడో మీరే చూడండి

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన ఆటతీరుతోనే కాదు.. తన ప్రవర్తనతోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు మిస్టర్‌ కూల్‌. మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపంచే ధోని, బయట మాత్రం చాలా ఫ్రెండ్లీగా, సింపుల్ గా ఉంటాడు.

IPL 2023: చిన్నపిల్లాడిలా మారిపోయిన ధోని.. లక్నోప్లేయర్‌ కూతురితో ఎలా ఆడుకుంటున్నాడో మీరే చూడండి
Ms Dhoni
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2023 | 5:40 AM

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన ఆటతీరుతోనే కాదు.. తన ప్రవర్తనతోనూ అందరి మనసులు గెల్చుకున్నాడు మిస్టర్‌ కూల్‌. మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపంచే ధోని, బయట మాత్రం చాలా ఫ్రెండ్లీగా, సింపుల్ గా ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే చాలా మంది అభిమానులను మిస్టర్ కూల్ కి దగ్గర చేసింది. తాజాగా ఇది మరోసాని నిరూపితమైంది. సోమవారం చెన్నై- లక్నో మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోని వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. చెపాక్‌ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ ధోని ఆఖరి ఓవర్లో కొట్టిన రెండు సిక్సులు మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచాయి. ఈ సమయంలో ‘ధోని.. ధోని’ అనే నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. కాగా ఈ మ్యాచ్ చూడడానికి లక్నో ఆటగాడు అయిన కృష్ణప్ప గౌతమ్ భార్య కూతురితో కలిసి చెపాక్‌ స్టేడియానికి వచ్చింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం కృష్ణప్ప గౌతమ్ కూతురుకి ధోని తన స్టైల్‌లో హై ఫైవ్ ఇచ్చాడు. కాసేపు తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి ఆ పాపతో కాసేపు సందడి చేస్తూ కనిపించాడు. దీంతో లక్నో ప్లేయర్‌ కృష్ణప్ప గౌతమ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచుల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మొదటి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయిన ధోని సేన.. సొంత గడ్డపై జరిగిన రెండో మ్యాచ్ లో లక్నో పై ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..