Nanditha Raj: సినిమాలకు దూరంగా ప్రేమకథా చిత్రమ్‌ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

చారడేసి కళ్లు.. ముగ్ధమనోహరమైన రూపం.. ఇలా చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం. అయితే ఆ చారడేసి కళ్లతోనే ప్రేమకథా చిత్రమ్‌ సినిమాలో అందరినీ భయపెట్టింది నందితా రాజ్‌. మారుతి దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ హర్రర్‌ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.

Nanditha Raj: సినిమాలకు దూరంగా ప్రేమకథా చిత్రమ్‌ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Actress Nanditha
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2023 | 6:04 AM

చారడేసి కళ్లు.. ముగ్ధమనోహరమైన రూపం.. ఇలా చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం. అయితే ఆ చారడేసి కళ్లతోనే ప్రేమకథా చిత్రమ్‌ సినిమాలో అందరినీ భయపెట్టింది నందితా రాజ్‌. మారుతి దర్శకత్వంలో సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ హర్రర్‌ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. డైరెక్టర్‌గా మారుతికి, హీరోగా సుధీర్‌బాబుకి మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో అందం, అభినయం పరంగా ఫుల్‌ మార్కులు కొట్టేసింది నందిత. దెయ్యంగా సప్తగిరికి చుక్కలు చూపించే పాత్రలో ఆమె అభినయం అందరికీ గుర్తుండిపోతుంది. తేజ డైరెక్షన్‌లో వచ్చిన నీకు నాకు డ్యాష్‌ డ్యాష్‌ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నందిత. ప్రేమకథా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత లవర్స్‌, రామ్‌లీలా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, శంకరా భరణం, సావిత్రి తదితర సినిమాల్లో నటించింది. అందంతో పాటు యాక్టింగ్‌ ట్యాలెంట్‌ ఉన్నప్పటికీ ఎందుకో కానీ స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయిందీ తెలుగమ్మాయి. ఎన్టీఆర్‌ జై లవకుశ, కథలో రాజకుమారి సినిమాల్లో క్యామియో రోల్స్‌లో కనిపించిన నందిత 2019 చివరిగా విశ్వామిత్ర అనే సినిమాలో కనిపించింది.

విశ్వామిత్ర సినిమా తర్వాత పత్తాలేకుండా పోయింది నందిత. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఆ మధ్యన ఓ ప్రముఖ దర్శకుడు తీసే వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు వార్తలు వచచాయి. అయితే అదేమీ జరగలేదు. కాగా నందిత రాజ్ కి సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో అనుభవం ఉంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు నటనకు స్వస్తి చెప్పి మోడలింగ్ రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..