Maharashtra: అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి.. ఊరేగింపు తర్వాత

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చేపట్టిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గురవారం రాత్రి కార్గిల్ నగర్ లో కొంతమంది స్థానికులు అంబేద్కర్ ఊరేగింపు చేపట్టారు.

Maharashtra: అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి.. ఊరేగింపు తర్వాత
Procession
Follow us
Aravind B

|

Updated on: Apr 15, 2023 | 2:05 PM

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చేపట్టిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గురవారం రాత్రి కార్గిల్ నగర్ లో కొంతమంది స్థానికులు అంబేద్కర్ ఊరేగింపు చేపట్టారు. 10.30 PM గంటలకు ఊరేగింపు అయిపోవడంతో అందులో పాల్గొన్నవారు రోడ్డుపై వెళ్తున్నారు. అయితే ఊరేగింపు చేసిన వాహనానికి ఉన్న ఓ ఇనుప స్థంబం రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కి తాకడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది.

దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతులు రూపేష్ సుర్వే (23), సుమీత్ సూద్(30) గా గుర్తించారు. వీరి మృతదేహాలు పోస్టు మార్టానికి పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..