Sukesh Chandrasekhar: ‘తీహార్ జైలుకు స్వాగతం’.. కేజ్రీవాల్ తరువాత కవితే.. సుఖేష్ మరో లేఖ..
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు సుఖేశ్ చంద్రశేఖర్. కవిత ఫోన్ నెంబర్లంటూ మరికొన్ని స్క్రీన్ షాట్లు విడుదల చేశాడు సుఖేశ్. ‘‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారని కవిత, కేజ్రీవాల్ ను స్వాగతించిన సుఖేష్. ముందు ‘కేజ్రీవాల్’, ఆ తర్వాత నీవంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు సుఖేష్.
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితపై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. కవిత ఫోన్ నెంబర్లంటూ మరికొన్ని స్క్రీన్ షాట్లు విడుదల చేశాడు సుకేష్. ‘‘తీహార్ క్లబ్’’కు వస్తున్నారని కవిత, కేజ్రీవాల్ ను స్వాగతించిన సుకేష్. ముందు ‘కేజ్రీవాల్’, ఆ తర్వాత నీవంతే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు. అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్ విడుదల చేస్తానని సుకేష్ తాజా ప్రకటనలో తెలిపాడు. ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇవ్వవద్దని, ఇవన్నీ పాత ట్రిక్కులని వ్యాఖ్యానించాడు. తనను దొంగ, అర్ధిక నేరగాడు అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములే అని పేర్కొన్నాడు. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సవాల్ విసిరాడు. కవితను ‘కవితక్క’ అని సంబోధించానని, ఆమెను తన పెద్ద అక్కగా భావించానని పేర్కొన్నాడు. కానీ, దేశం, ప్రజాప్రయోజనాల రీత్యా ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానని సుకేష్ వ్యాఖ్యానించాడు.
అంతేకాదు.. తాజా లేఖలో కవిత ఫోన్ నెంబర్లు ఉన్న స్క్రీన్ షాట్లు విడుదల చేశాడు. కవిత పేరిట సేవ్ చేసుకుని చాట్ చేసిన 2 ఫోన్ నెంబర్లు 6209999999, 8985699999 స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు. ఇంకో ఛాట్‌లో సత్యేంద్ర జైన్ వ్యక్తిగత ఫోన్ నెంబర్ 9810154102 అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మొత్తం 703 ఛాట్లున్నాయనీ, అందులో ఇప్పటి వరకు కేవలం 2 ‘చాట్లు’ మాత్రమే బయటపెట్టానని పేర్కొన్నాడు సుకేష్. ఇంకా అనేక వీడియో చాట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్న సుకేష్.. వాటిని కూడా త్వరలోనే విడుదల చేస్తానని చెప్పాడు.
తెలుగు భాష సుకేష్ ఎలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడంపైనా స్పందించాడు. తెలుగు ( తండ్రి), తమిళం ( అమ్మ) రెండూ తన మాతృభాషలే అని క్లారిటీ ఇచ్చాడు సుకేష్. ఇంకా అనేక భాషలు కూడా మాట్లాడగలనని పేర్కొన్నారు. తనను ఎవరో రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్ధరహితం కొట్టిపాడేశాడు. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అందుకే తాను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు సుకేష్. తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలని భావించే.. ఈ వాస్తవాలను బయటపెడుతున్నానని చెప్పాడు సుకేష్. ‘మీరు కూడా సిబిఐ, ఈడీ విచారణకు సహకరించాలి’ అని వ్యాఖ్యానించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..