Watch Video: మీ క్రియేటివిటీకి పిండం పెట్ట.. సైకిల్, స్కూటర్లకు గుండ్రటి టైర్లే ఎందుకని ఇలా..
సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి.
సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి. అయితేనేం కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు సైకిల్ టైర్లపై చేసిన ఓ ఆవిష్కరణ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టైర్లు గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలోఉన్న సరికొత్త సైకిల్‌ను తయారు చేశారు. చతురస్రాకంలో ఉంటే సైకిల్ ఎలా ముందుకెళ్తుందబ్బ అని అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ సైకిల్ చక్రాలు కదలకుండా వాటిపై ఏర్పాటు చేసిన రబ్బర్ రౌండ్‌గా తిరుగుతుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 19 మిలియన్ల మంది వీక్షించారు. 40 వేల లైక్స్ వచ్చాయి. ఈ సైకిల్ పై నెటిజన్లు భిన్నమైన రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ ఎక్కడ దొరుకుతుందని ఒకరు..ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందని మరొకలు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వింతగా ఉన్న ఆ సైకిల్ వీడియోను చూసేయండి.
How The Q created a bike with fully working square wheels (capable of making turns)
[full video: https://t.co/wWdmmzRQY3]pic.twitter.com/bTIWpYvbG1
— Massimo (@Rainmaker1973) April 11, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..