IRCTC Tours: ఇది ‘టేస్ట్ ఆఫ్ తెలంగాణ’.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్.. పూర్తి వివరాలు ఇవి..
దేశ వ్యాప్తంగా టూర్లను నడుపుతున్న ఐఆర్‌సీటీసీ ఇప్పుడు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందులో టేస్ట్ ఆఫ్ తెలంగాణ ఒకటి. హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా దీనిలో కవరవుతుంది. వీకెండ్‌లో ఏదైనా టూర్ ప్లాన్ చేసే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు ఉండే ఈ టేస్ట్ ఆఫ్ తెలంగాణ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ తప్పక చూడాల్సిన నగరం. కేవలం సిటీలో మాత్రమే కాక నగరానికి నలుదిశలా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటిని చూసి వచ్చేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రన్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా టూర్లను నడుపుతున్న ఐఆర్‌సీటీసీ ఇప్పుడు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందులో టేస్ట్ ఆఫ్ తెలంగాణ ఒకటి. హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు యాదాద్రి, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా దీనిలో కవరవుతుంది. వీకెండ్‌లో ఏదైనా టూర్ ప్లాన్ చేసే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు ఉండే ఈ టేస్ట్ ఆఫ్ తెలంగాణ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టూర్ వివరాలు ఇవి..
- ప్యాకేజీ పేరు: టేస్ట్ ఆఫ్ తెలంగాణ(ఎస్‌హెచ్‌హెచ్005)
- వ్యవధి: మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు
- ప్రయాణ సాధనం: ఏసీ కారు లేదా వ్యాన్
- ప్రయాణ తేదీలు: మంగళవారం, శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో టూర్ ఉంటుంది.
- సందర్శించే ప్రాంతాలు: హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు గోల్కోండ కోట, ఐక్యతా విగ్రహం, యాదాద్రి, రామోజీ ఫిలిం సిటీ
పర్యటన సాగుతుందిలా..
డే1(హైదరాబాద్): ఉదయం హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మిమ్మల్ని క్యాబ్‌లో పికప్ చేస్తారు. హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్లో చెకిన అయ్యి ఫ్రెష అవుతారు. అనంతరం చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. హోటల్‌కి తిరిగి వెళ్తారు. హైదరాబాద్‌లో రాత్రి భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే2(హైదరాబాద్): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేశాక, బిర్లా మందిర్, గోల్కొండ కోట, మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలను సందర్శిస్తారు. సాయంత్రానికి హోటల్ కి చేరి, రాత్రి భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
డే3(హైదరాబాద్-యాదాద్రి): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేశాక యాదాద్రికి బయలుదేరుతారు. సురేంద్రపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కి తిరిగి వస్తారు. రాత్రికి హోటల్లో డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
డే4(హైదరాబాద్-రామోజీ ఫిల్మ్ సిటీ): ఉదయం అల్పాహారం తీసుకున్నాక, రామోజీ ఫిల్మ్ సిటీకి బయలుదేరుతారు. సాయంత్రం మళ్లీ హైదరాబాద్/సికింద్రాబాద్/కాచీగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
- ఒక్కరు లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్తే.. హోటల్ రూంలో సింగిల్ గానే ఉండాలనుకొంటే ఒక్కొక్క పర్సన్ కి రూ. 30,390 చార్జ్ చేస్తారు. అదే ఇద్దరు కలసి రూం షేర్ చేసుకుంటే రూ. 16,130 ఖర్చు అవుతుంది. ముగ్గురు కలిసి షేర్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్కరికీ రూ. 12,610 తీసకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసరం అయితే రూ. 8,350, బెడ్ అవసరం లేకపోతే రూ. 8,350 చార్జ్ చేస్తారు.
- నలుగురు నుంచి ఆరుగురు కలిసి ప్యాకేజీ తీసుకోవాలనుకుంటే హోటల్లో డబుల్ షేరింగ్ అయితే రూ.13080, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.11,410 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు రూ. 8,350 చార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో కవరయ్యేవి..
హైదరాబాద్ లో ఏసీ వసతి కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్న భోజనం ప్యాకేజీలో కవర్ అవ్వదు. లోకల్ ప్రయాణాలకు ఏసీ వాహనాన్ని అందిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ అందిస్తారు. అయితే అన్ని దేవాలయాలు, రామోజీ ఫిల్మ్ సిటీలోకి ఎంట్రీ ఫీజులు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లో టూర్ ప్యాకేజెస్ విభాగాన్ని సందర్శించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..