IRCTC Tours: రాజస్థాన్ రాజసం చూసొద్దాం రండి.. ఐఆర్‌సీటీసీ నుంచి అతి తక్కువ ధరలోనే విమాన ప్రయాణం..
రాజస్థాన్ రాజసం గురించి వినే ఉంటారు. అక్కడి కట్టడాలు, రాజ భవనాలు, కోటల దర్పం చూడాలనే గానీ వివరించడానికి మాటలు సరిపోవు. ఆ ప్రాంతాలను సందర్శించాలనుకొనే వారికి ఐఆర్ సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. రాయల్ రాజస్థాన్ పేరిట ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ టూర్ సెప్టెంబర్ 10న ప్రారంభమవుతుంది.
రాజస్థాన్ రాజసం గురించి వినే ఉంటారు. అక్కడి కట్టడాలు, రాజ భవనాలు, కోటల దర్పం చూడాలనే గానీ వివరించడానికి మాటలు సరిపోవు. ఆ ప్రాంతాలను సందర్శించాలనుకొనే వారికి ఐఆర్ సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. రాయల్ రాజస్థాన్ పేరిట ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ టూర్ సెప్టెంబర్ 10న ప్రారంభమవుతుంది. టూర్ లో జైపూర్, జోధ్ పూర్, పుష్కర్, ఉదయ్ పూర్ ప్రాంతాలను చుట్టిరావచ్చు. ఐఆర్సీటీసీ రాయల్ రాజస్థాన్ టూర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది ప్యాకేజీ..
ప్యాకేజీ పేరు: రాయల్ రాజస్థాన్(ఎస్ హెచ్ఏ12)
ప్రయాణ సాధనం: విమానం
ప్రయాణ వ్యవధి: ఐదు రాత్రులు/ఆరు పగళ్లు
ప్రయాణ తేదీ: 2023, సెప్టెంబర్ 10
సందర్శించే ప్రాంతాలు: జైపూర్, పుష్కర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్
ప్రయాణం సాగేదిలా..
డే1(హైదరాబాద్-జైపూర్): ఉదయ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ సిబ్బంది మిమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్ కి తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అయ్యి భోజనం చేస్తారు. తర్వాత అమెర్ కోటను సందర్శిస్తారు. రాత్రికి జైపూర్ హోటల్లోనే బస చేస్తారు.
డే2(జైపూర్): హోటల్లో అల్పాహారం తీసుకున్న తర్వాత జైపూర్ లోని సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ సందర్శిస్తారు. సాయంత్రం షాపింగ్ కోసం కొంత ఫ్రీ సమయం ఉంటుంది. రాత్రికి జైపూర్ లోనే బస ఉంటుంది.
డే3(జైపూర్-పుష్కర్-ఉదయ్ పూర్): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, హోటల్ చెక్ అవుట్ అవ్వాలి. అక్కడి నుంచి మూడు గంటలపాటు ప్రయాణం చేసి పుష్కర్ కు చేరుకుంటారు. అక్కడ బ్రహ్మా టెంపుల్ సందర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి ఉదయ్ పూర్ కి ప్రయాణమవుతారు. ఇది ఆరు గంటలపాటు ప్రయాణం చేసి రాత్రికి ఉదయ్ పూర్ చేరుతారు. హోటల్లో చెక్ అయ్యి రాత్రి భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే4(ఉదయ్ పూర్- జోధ్ పూర్): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. జోధ్ పూర్ కి ప్రయాణమవుతారు. ఇది ఉదయ్ పూర్ నుంచి 250కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల పాటు ప్రయాణించి మధ్యాహ్నానికి జోధ్ పూర్ చేరుకుంటారు. అక్కడ ఉమైడ్ భవన్ ప్యాలెస్ సందర్శిస్తారు. హోటల్లో చెక్ అయ్యి రాత్రికి భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
డే6(జోధ్ పూర్- హైదరాబాద్): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, అక్కడి నుంచి బయలుదేరి మెహ్రాన్‌గర్ కోటకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి తిరిగి జోధ్ పూర్ విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్ విమానం ఎక్కి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో టూర్ ముగుస్తుంది.
చార్జీల వివరాలు ఇలా..
హోటల్లో సింగిల్ ఉండాలనుకుంటే రూ. 37,750 చార్జ్ చేస్తారు. అలాగే డబుల్ ఆక్యూపెన్సీ అయితే ఒక్కొక్కరికీ రూ. 30,450 తీసుకుంటారు. ట్రిపుల్ ఆక్యూపెన్సీ అయితే ఒక్కొక్కరికీ రూ. 28,900 చార్జ్ అవుతుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ తో కావాలనుకుంటే రూ. 25,200గా ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ అవసరం లేకపోతే రూ. 20,100 చార్జ్ చేస్తారు. 2 నుంచి 4ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా అయితే రూ. 17,900 తీసుకుంటారు. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లో సంప్రదించవచ్చు.
ప్యాకేజీలు ఇవి ఉంటాయి..
ప్యాకేజీలో విమాన టికెట్లు, రానూపోనూ కవర్ అవుతాయి. అలాగే ఒకసారి మధ్యాహ్న భోజనం, ఐదు రాత్రిళ్లు డిన్నర్, ఐదు బ్రేక్ ఫాస్ట్ లు ప్యాకేజీలో ఉంటాయి. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న భోజనం పర్యాటకులే చూసుకోవాలి. రాజస్థాన్ లో లోకల్ ప్రయాణాలకు ఏసీ బస్సు ఉంటుంది. ఐఆర్ సీటీసీ టూర్ ఎస్కార్టులు ఉంటారు. పలు సందర్శనీయ ప్రాంతాలు, చిరుతిళ్లు, దేవాలయాల టికెట్లు అన్ని పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..