IRCTC Tours: హైదరాబాద్ టు ద్వారక.. అతి తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ.. స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా చూడొచ్చు..
దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లాలనుకొన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లి తీసుకొచ్చే సౌకర్యం మనకు ఐఆర్ సీటీసీ అందుబాటులో తెచ్చింది. అన్ని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. తక్కువ ధరకే ట్రావెలింగ్, హోటల్, లోకల్ ట్రాన్స్ పోర్ట్ లను అందిస్తోంది. అందులో సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఒకటి. దీనికిక సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లాలనుకొన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లి తీసుకొచ్చే సౌకర్యం మనకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ అందుబాటులో తెచ్చింది. అన్ని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. తక్కువ ధరకే ట్రావెలింగ్, హోటల్, లోకల్ ట్రాన్స్ పోర్ట్ లను అందిస్తోంది. అందులో సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఒకటి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనగానే మనకు భారీ సర్థార్ వల్లభాయ్ పటేల్ స్వరూపం కళ్ల ముందు కదలాడుతుంది. దేశ సమైఖ్యతకు చిహ్నంగా దీనిని నిర్మించారు. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీతో పాటు ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలైన ద్వారక, సోమ్ నాథ్, అహ్మదాబాద్ ప్రాంతాలను ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో చుట్టేసి రావొచ్చు. సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్ ఆరు రాత్రులు, ఏడు రోజులు ఉంటుంది. హైదరాబాద్ శంషాబాద్ విమానశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టూర్ వివరాలు..
ప్యాకేజీ పేరు: సౌరాష్ట్ర విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఎస్ హెచ్ఏ27)
వ్యవధి: ఆరు రాత్రులు/ఏడు పగళ్లు
ప్రయాణ తేదీలు: 2023, సెప్టెంబర్ 10, అక్టోబర్ 29, నవంబర్ 17
ప్రయాణ సాధనం: విమానం
సందర్శించే ప్రాంతాలు: అహ్మదాబాద్, ద్వారకా, సోమ్ నాథ్, వడోదరా, రాజ్ కోట్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ
పర్యటన సాగుతుందిలా..
డే1(హైదరాబాద్-అహ్మదాబాద్): ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కి అహ్మదాబాద్ చేరుకుంటారు. ఆర్ సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్ కి తీసుకెళ్తారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత అడలాజ్ స్టెప్ వెల్, సబర్మతీ ఆశ్రమం సందర్శిస్తారు. సాయంత్రం అక్షరథామ్ టెంపుల్ కు వెళ్తారు. రాత్రికి తిరిగి అహ్మదాబాద్ హోటల్ కు చేరుకొని డిన్నర్ చేస్తారు. బస అక్కడే.
డే2(అహ్మదాబాద్-ద్వారక): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. అహ్మదాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకకు బయలుదేరుతారు. మధ్యలో రాజ్ కోట్ ను సందర్శించొచ్చు. ద్వారకకు వెళ్లిన తర్వాత హోటల్ లో చెకిన్ అయ్యి, అక్కడే రాత్రి బస చేస్తారు.
డే3(ద్వారక): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి ద్వారకాదీష్ టెంపుల్, దాని పరిసరాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం బెట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగలను సందర్శిస్తారు. రాత్రికి ద్వారకలోని హోటల్ ని సందర్శిస్తారు.
డే4(ద్వారక-సోమ్ నాథ్): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి సోమ్ నాథ్ కు బయలుదేరుతారు. ద్వారక నుంచి సోమ్ నాథ్ 235 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లి హోటల్లో చెకిన్ అయ్యి తర్వాత సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
డే5(సోమ్ నాథ్-వడోదరా): హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. తర్వాత లక్ష్మి విలాస్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత కెవాడియాకు బయలుదేరుతారు. మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు. సాయంత్రం వరకూ అక్కడ ఉన్న పలు రకాల ఆకర్షణలను ఆస్వాదించవచ్చు. రాత్రికి కెవాడియాలోని టెంట్ సిటీలో బస చేస్తారు.
డే7(స్టాట్యూ ఆఫ్ యూనిటీ-అహ్మదాబాద్): హోటల్లోనే బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. కెవాడియాలో చూడాల్సిన పలు ప్రాంతాలను తిలకిస్తారు. ఆ తర్వాత అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు తిరిగి చేరుకుంటారు. రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ విమానం ఎక్కుతారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
ప్యాకేజీలో ప్రయాణ చార్జీలతో పాటు హోటల్ చార్జీలు కూడా కవర్ అవుతాయి. మొత్తం కలిపి ఒక్కొక్కరికీ ధరలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్ పదో తేదీన ప్రారంభమయ్యే టూర్ చార్జీలు.. హోటల్ రూంలో ఒక్కరే ఉండాలనుకొంటే రూ. 42,950 అవుతుంది. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కిరికీ రూ. 32,850 చార్జ్ చేస్తారు. ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. రూ. 31,550 ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ కావాలనుకొంటే రూ. 28,900 తీసుకుంటారు. అదే బెడ్ అవసరం లేదనుకుంటే రూ. 25,550 ఉంటుంది. 2 నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలకు బెడ్ లేకుండా రూ. 18,500 వరకూ తీసుకుంటారు.
అక్టోబర్- నవంబర్లలో టూర్ ప్యాకేజీ ధరలు.. హోటల్ రూంలో ఒక్కరే ఉండాలనుకొంటే రూ. 49,5000 అవుతుంది. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కిరికీ రూ. 36,750 చార్జ్ చేస్తారు. ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. రూ. 35,900 ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ కావాలనుకొంటే రూ. 31,900 తీసుకుంటారు. అదే బెడ్ అవసరం లేదనుకుంటే రూ. 30,050 ఉంటుంది. 2 నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలకు బెడ్ లేకుండా రూ. 20,200 వరకూ తీసుకుంటారు.
ప్యాకేజీలో కవర్ అయ్యే ప్రయోజనాలు..
హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ విమాన చార్జీలు, ఏడు బ్రేక్ ఫాస్ట్ లు, ఆరు డిన్నర్లు అందిస్తారు. మధ్యాహ్న భోజనం పర్యాటకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. స్థానికంగా పర్యటించడానికి ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ ఉంటుంది. ఐఆర్సీటీసీ ఎస్కార్ట్ సౌకర్యం ఉంటుంది. స్టాట్యూఆఫ్ యూనిటీ గ్యాలరీ టికెట్ ను అందిస్తారు. అయితే ఆలయాల్లో దర్శన టికెట్లు, విమానంలో ఆహారం వంటి ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐర్సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..