IRCTC Tours: హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మహా దర్శన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవి..
దేశ వ్యాప్తంగా వివిధ టూర్ ప్యాకేజీలు అమలు చేస్తోంది ఐఆర్సీటీసీ టూరిజమ్. తక్కువ ధరలోనే పైన కశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకూ అన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుంది. అందులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. పర్యాటకులకు ఈ ప్యాకేజీలు సౌకర్యవంతంగా ఉండటంతో అందరూ వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిల్లో ఒకటి మధ్య ప్రదేశ్ మహా దర్శన్ ప్యాకేజీ.
దేశ వ్యాప్తంగా వివిధ టూర్ ప్యాకేజీలు అమలు చేస్తోంది ఐఆర్సీటీసీ టూరిజమ్. తక్కువ ధరలోనే పైన కశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకూ అన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుంది. అందులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. పర్యాటకులకు ఈ ప్యాకేజీలు సౌకర్యవంతంగా ఉండటంతో అందరూ వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిల్లో ఓ అద్భుతమైన ప్యాకేజీ మధ్య ప్రదేశ్ మహా దర్శన్ ప్యాకేజీ. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలను కవర్ చేస్తుంది. మహేశ్వర్, ఓం కారేశ్వర్, ఉజ్జయినీ దేవాలయలను సందర్శించొచ్చు. మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లలో మధ్య ప్రదేశ్ లోని ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి.
ఇవి ప్యాకేజీ వివరాలు..
ఐఆర్ సీటీసీ ప్యాకేజీ పేరు: మధ్య ప్రదేశ్ మహా దర్శన్(ఎస్ హెచ్ఏ15) ప్రయాణ సాధనం: విమానం వ్యవధి: మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ప్రయాణ తేదీ: 2023, సెప్టెంబర్ 09 సందర్శించే ప్రాంతాలు: ఉజ్జయినీ, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్
ప్రయాణం సాగుతుందిలా..
డే1(హైదరాబాద్-ఇండోర్): తెల్లవారుజామునే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరుతారు. ఇండోర్ లో దిగాక, ఐఆర్ సీటీసీ సిబ్బంది ఉజ్జయినీకి తీసుకెళ్తారు. ఇది ఇండోర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హోటల్లో చెక్ అయ్యి, ఫ్రెష్ అయ్యాక అల్పాహారం అందిస్తారు. ఆ తర్వాత ఉజ్జయినీలో స్థానిక దేవాలయాల సందర్శన ఉంటుంది. హరసిద్ధి మాత టెంపుల్, సాందీపని ఆశ్రమం, కాల భైరవ ఆలయం, మంగళనాథ్ టెంపుల్, చింతామన్ గణేష్ ఆలయాలను చూపిస్తారు. సాయంత్రం మహా కాళేశ్వర్ టెంపుల్ చూడొచ్చు. రాత్రికి ఉజ్జయినీలోనే డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
డే2(ఉజ్జయినీ- ఓంకారేశ్వర్): ఉదయం మహాకాళేశ్వర్ టెంపుల్ ను సందర్శించొచ్చు. ఆ తర్వాత అల్పాహారం చేసి హోటల్లో చెక్ అవుట్ అవ్వాలి. అక్కడ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర్ టెంపుల్ కి వెళ్తారు. దర్శనం అయ్యాక రాత్రి వరకూ అక్కడే ఉండి బస చేస్తారు.
డే3(ఓంకారేశ్వర్-మహేశ్వర్- ఇండోర్): ఓంకారేశ్వర్లోని హోటల్లోనే ఉదయం బ్రేక్ ఫాక్ చేసి, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహిల దేవీ కోట, నర్మదా ఘాట్ లను సందర్శిస్తారు. అక్కడి నుంచి తిరిగి ఇండోర్ కు పయనమవుతారు. రాత్రికి ఇండోర్ లో భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే4(ఇండోర్-హైదరాబాద్): ఇండోర్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అన్నపూర్ణ మందిర్ సందర్శిస్తారు. అలాగే లాల్ బాగ్ ప్యాలెస్ కూడా చూస్తారు. మధ్యాహ్నం లంచ్ చేశాక, ఇండోర్ ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 5 గంటలకు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు ఇలా..
సింగిల్ ఆక్యూపెన్సీలో ఒక్కొక్కరికీ రూ. 28,700 చార్జ్ చేస్తారు. అదే డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 22,900 తీసుకుంటారు. ట్రిపుల్ షేరింగ్ లో ఒక్కొక్కరికీ రూ. 22,000 చార్జ్ చేస్తారు. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ తో పాటు రూ. 20,250 తీసుకుంటారు. ఒక వేళ బెడ్ అవసరం లేకపోతే రూ. 18,150 చార్జ్ చేస్తారు. 2 నుంచి నాలుగేళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ. 15,350 తీసుకుంటారు.
ప్యాకేజీలో లభించేవి ఇవి..
విమాన చార్జీలు పూర్తిగా కవర్ అవుతాయి. బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ అందిస్తారు. మధ్యాహ్న భోజనం పర్యాటకులే చూసుకోవాలి. లోకల్లో తిరగడానికి ఏసీ టెంపో ట్రావెలర్ అందుబాటులో ఉంటుంది. ట్రావెల్ ఇన్సురెన్స్ అందిస్తారు. ఐఆర్ సీటీసీ టూర్ ఎస్కార్ట్ ఉంటుంది. ఆలయాల్లో దర్శనం టికెట్లు పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..