Kajal For Eyes: చంటి పిల్లల కంటికి కాటుక పులిమేస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్.. పూర్తిగా చదవండి..

పాత కాలంలో కాటుకను ఇంట్లోనే తయారు చేసేవారు. నూనె దీపాల నుంచి వచ్చిన మసిని తీసుకొని దానికి నెయ్యి లేదా ఆమదాన్ని కలిపి ముద్దగా చేసి కాటుకలా వాడేవారు. అయితే ఇప్పుడు దానిని ఎవరూ వాడటం లేదు. బయట మార్కెట్లో లభ్యమవుతున్న కాజల్ నే అందరూ వినియోగిస్తున్నారు. దీనిలో హాని చేసే లెడ్ ఉంటుంది.

Kajal For Eyes: చంటి పిల్లల కంటికి కాటుక పులిమేస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్.. పూర్తిగా చదవండి..
New Born Baby
Follow us
Madhu

|

Updated on: Jun 30, 2023 | 3:00 PM

మన భారతీయ సంప్రదాయంలో కాటుకకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల మహిళలు కాటుకను తమ కళ్లకు పెట్టుకుంటారు. అయితే శిశువుల కంటికి కాటుక పెట్టడం మంచిదేనా? సాధారణంగా శిశువులకు దిష్టి తగలకుండా, కళ్లు బాగా కనిపించాలన్న ఉద్దేశంలో శిశువులకు కాటుకను పెడుతుంటారు. కాటుక అంటే నల్ల రంగులో పేస్ట్ మాదిరిగా ఉండే ఒక ఐ లైనర్ అని చెప్పొచ్చు. దీనిని కింద కనురెప్పల లోపల వైపు పూస్తుంటారు. అయితే పురాతన కాలంలో ఈ కాటుకను ఇళ్లలనే సహజ ఉత్పత్తులతో తయారు చేసేవారు. కానీ ఇప్పుడొస్తున్న కాటుక రసాయనాలతో కూడుకున్నది. బయట కొనుగోలు చేసే కాటుకలో లెడ్ ఉంటుంది. ఇది మీ పాప ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

పాత కాలంలో ఇలా..

పాత కాలంలో కాటుకను ఇంట్లోనే తయారు చేసేవారు. నూనె దీపాల నుంచి వచ్చిన మసిని తీసుకొని దానికి నెయ్యి లేదా ఆముదాన్ని కలిపి ముద్దగా చేసి కాటుకలా వాడేవారు. అయితే ఇప్పుడు దానిని ఎవరూ వాడటం లేదు. బయట మార్కెట్లో లభ్యమవుతున్న కాజల్ నే అందరూ వినియోగిస్తున్నారు. దీనిలో హాని చేసే లెడ్ ఉంటుంది.

ఎందుకు సురక్షితం కాదు..

బయట కొనుగోలు చేస్తున్న కాటుక సురక్షితం కాదని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. 50శాతం ఈ కాజల్ ఉత్పత్తుల్లో లెడ్ సల్ఫైడ్ ఉంటుందని వివరిస్తోంది. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ఇది విష ప్రభావాన్ని పిల్లలపై చూపుతుంది. ప్రధానంగా మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. కిడ్నీలను పాడు చేసతుంది. బోన్ మ్యారో ను దెబ్బతీస్తుంద. కాన్ వల్షన్స్ కు కారణం అవుతుంది. కోమాలో చేరుకొనే ప్రమాదం కూడా ఉంది. కొన్ని రేర్ పరిస్థితుల్లో శిశువులు మృతి చెందే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు ఎక్కువగా తమ చేతిని నేలపై పెడుతుంటారు.. అవే చేతిలో కళ్లలోనూ, నోట్లోనూ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ లెడ్ వారి కడుపులోకి కూడా వెళ్లిపోతుందని చెబుతున్నారు. దీనివల్ల పేగు సంబంధిత వ్యాధులు కూడా సోకుతాయని వివరిస్తున్నారు.

ఆరోగ్య కరమైన ప్రత్యామ్నాయం ఏది?

కొన్ని పరిశోధనల ప్రకారం ఆయుర్వేదంలో కొన్ని మూలికలతో తయారు చేసే కాటుక సురక్షితమని తేలింది. ఎల్సిప్టా ఆల్బా, వెర్నోనియా సెరెనియా వంటి వాటితో చేసిన కాటుక మీ పిల్లల కంటికి మంచిది.

అలాగే ఇంట్లో కూడా మీరే సొంతంగా కాటుకను తయారు చేసుకోవచ్చు.. అదెలా అంటే.. ఆముదం నూనె పోసిన దీపం వత్తులను తీసుకోవాలి. దానికి మూడు నుంచి నాలుగు బాదం పప్పులు, నెయ్యి తీసుకోవాలి. మీరు కాటుక తయారు చేసే ముందు ఎటువంటి సూక్ష్మక్రిములు లేకుండా ఉండేందుకు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత దీపం వెలిగించి బాదం పప్పును ఆ మంటలో కాలనివ్వాలి. బాదం పప్పును కాలినప్పుడు ప్లేట్ దిగువ భాగంలో మసి పడుతుంది. దానిని సేకరించి స్టోర్ చేసుకోవాలి. దనికి కొన్ని చుక్కులు నెయ్యిని కలుపుకొని స్టెరిలైజ్డ్ జార్ లో భద్రం చేసుకొని, కళ్లకు పెట్టుకోవచ్చు.

ఒకవేళ దీనిని కళ్ల పెట్టుకున్నప్పుడు ఏమైనా ఇరిటేషన్ వచ్చినా, కళ్లు ఎర్రబడినా, కళ్ల వాపు వంటి ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే కళ్ల వైద్య నిపుణులను సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..