Indian Railway Rules: విమానంలోని నిబంధనలు రైలులో అమలు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు..
మన దేశంలో ప్రధాన రవాణా సాధనం రైలు మార్గం. సాధారణ ప్రజల నుంచి పెద్ద బిజినెస్ పర్సన్ల వరకూ రైలులో ప్రయాణిస్తుంటారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు తక్కువ చార్జీలు కూడా అందుకు కారణం. అయితే ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీకి సంబంధించి రైలులో కూడా నిబంధనలు ఉన్నాయి. కానీ కొంత మందికి మాత్రమే ఈ విషయంపై అవగాహన ఉంది.
విమానంలో ప్రయాణం అంటే చాలా విషయాలను తెలుసుకోవాలి. టికెట్ బుకింగ్ నుంచి లగేజీ చెకింగ్, బోర్డింగ్ పాస్, ఫైట్ ఎక్కడం, దిగడం, తిరిగి లగేజీ తీసుకోవడం వరకూ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రతి దానికి నిబంధనలు ఉంటాయి. అందుకు మొదటి సారి విమానం ఎక్కేవారు తప్పనిసరిగా అంతకు ముందు విమానం ఎక్కిన వారిని వారి వెంట తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా లగేజీ విషయంలో విమానయాన సంస్థ కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుంది. కొంత పరిమిత బరువు వరకూ మాత్రమే అనుమతిస్తుంది. ఆపై బరువు ఉంటే అక్కడే మనం తగ్గించాల్సి ఉంటుంది. ఇలానే రైల్వేలోనూ తీసుకొచ్చింది. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో అమలులోనే ఉంది. అయితే దీనిని ఇకపై కచ్చితంగా అమలు చేయనుంది. రైలులో ప్రయాణించే వారు తప్పనిసరిగా పరిమితి వరకూ లగేజీ తీసుకురావాల్సి ఉంటుంది. ఆ పరిమితి మించితే ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి.. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రైలులో లగేజీ..
మన దేశంలో ప్రధాన రవాణా సాధనం రైలు మార్గం. సాధారణ ప్రజల నుంచి పెద్ద బిజినెస్ పర్సన్ల వరకూ రైలులో ప్రయాణిస్తుంటారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు తక్కువ చార్జీలు కూడా అందుకు కారణం. అయితే ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీకి సంబంధించి రైలులో కూడా నిబంధనలు ఉన్నాయి. కానీ కొంత మందికి మాత్రమే ఈ విషయంపై అవగాహన ఉంది. వాస్తవానికి పరిమితికి మించి లగేజీ ఉంటే కచ్చితంగా దానిని టికెట్ తీసుకొనే సమయంలోనే చెప్పి అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల పెనాల్టీలు కూడా చెల్లించే వారు ఉంటారు.
ఎంత లగేజీ తీసుకెళ్లాలి..
భారతీర రైల్వే మినిస్ట్రీ చేసిన ట్వీట్లలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎక్కువ లగేజీని రైళ్లలో తీసుకెళ్లవద్దని సూచించింది. అలాగే రైళ్లలో ఎంత బరువు వరకూ లగేజీ తీసుకెళ్లవచ్చో కూడా వివరించింది. స్లీపర్ క్లాస్ నుంచి ఏసీ కోచ్ వరకూ ప్రతి దానిలో పరిమితంగానే లగేజీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బరువు ఎంత ఉండాలి అంటే..
రైలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుడు గరిష్టంగా 50కేజీల వరకూఉచితంగా రైలులో తీసుకెళ్ల వచ్చు. ఆ పైన తీసుకెళ్తే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకమైన టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏసీ కోచ్ లో ప్రయాణించాలనుకొంటే దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. ఏసీ కోచ్ లలో మీరు ప్రయాణిస్తే 70 కేజీల వరకూ మీకు ఉచిత పరిమితి ఉంటుంది. అదే స్లీప్ కోచ్ లో అయితే మీకు 40 కేజీల వరకూ మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
పరిమాణం ఎంత ఉండాలి..
రైలులో ప్రయాణించేటప్పుడు భారీ లగేజీకి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ప్రయాణికులు తమ వెంట భారీ లగేజీని తీసుకెళ్తే కనీసం రూ.30 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ లగేజీ ఉంటే ప్రయాణికులు ఒకటిన్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..