IRCTC Tours: హైదరాబాద్-శ్రీశైలం-యాదాద్రి.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవి..
శ్రీశైలం వెళ్లాలనే ప్లాన్‌లో ఉంటే మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే శ్రీశైలంతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. వేరే ప్రాంతాల్లో నివసించే వారు హైదరాబాద్ ను చూడాలనుకుంటే కూడా ఈ టూర్ ప్యాకేజీని ఎంపిక చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. కృష్ణమ్మ చెంతన కొలువుదీరిన మల్లన్నస్వామిని దర్శించుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. మీరు కూడా శ్రీశైలం వెళ్లాలని ప్లాన్‌లో ఉంటే మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే శ్రీశైలంతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. మీరు ఒకవేళ హైదరాబాద్‌తోపాటు శ్రీశైలం కూడా చూడాలని భావిస్తే ఈ టూర్ ప్యాకేజీ బాగా ఉపయోగపడుతుంది. వేరే ప్రాంతాల్లో నివసించే వారు హైదరాబాద్ ను చూడాలనుకుంటే కూడా ఈ టూర్ ప్యాకేజీని ఎంపిక చేసుకోవచ్చు. స్పిరిచ్యువల్ తెలంగాణ విత్ శ్రీశైలం పేరిట ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఈ టూర్ మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్యాకేజీ ఇలా..
పేరు: స్పిరిచ్యువల్ తెలంగాణ విత్ శ్రీశైలం(ఎస్‌హెచ్‌హెచ్004)
వ్యవధి: మూడు రాత్రులు/నాలుగు పగళ్లు
ప్రయాణ సాధనం: కారు
ప్రయాణ తేదీ: ప్రతి రోజూ(మంగళవారం, శుక్రవారం తప్ప)
సందర్శించే ప్రాంతాలు: హైదరాబాద్ సిటీ, శ్రీశైలం, యాదాద్రి
పర్యటన సాగుతుందిలా..
డే1(హైదరాబాద్): హైదరాబాద్/సికింద్రాబాద్/ కాచీగూడా రైల్వే స్టేషన్ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్‌ను సందర్శిస్తారు. తిరిగి హోటల్‌కు వచ్చి రాత్రి భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే2(హైదరాబాద్-శ్రీశైలం): హోటల్ నుంచి ఉదయం 5గంటలకు మిమ్మల్ని పికప్ చేసుకొని వెళ్తారు. ఐదు గంటలు ప్రయాణం ఉంటుంది. అల్పాహారం మీరే చేయాల్సి ఉంటుంది. మల్లికార్జున జ్యోతిర్లింగ టెంపుల్, ఆలయ పరసరాలు సందర్శిస్తారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి హోటల్లోనే భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
డే3(హైదరాబాద్): ఉదయం అల్పాహారం చేస్తారు. అనంతరం బిర్లా మందిర్, గోల్కొండ కోట సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ ఇక్వాలిటీ సందర్శిస్తారు. అలాగే సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకొని అక్కడే బస చేస్తారు.
డే4(హైదరాబాద్-యాదాద్రి): ఉదయం అల్పాహారం తీసుకున్నాక హోటల్‌లో చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి బయలు దేరి శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్‌ను సందర్శిస్తారు. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
- కనీసం ఒక మనిషి నుంచి ముగ్గరు కలిసి ప్రయాణి చేస్తే.. హోటల్‌ల్లో సింగిల్ షేరింగ్ రూం అయితే ఒక్కొక్కరికీ రూ. 37,200 చార్జ్ చేస్తారు. అదే డబుల్ షేరింగ్ రూం అయితే ఒక్కొక్కరికీ రూ. 19,530 తీసుకుంటారు. అదే ముగ్గురు కలిసి రూం షేర్ చేసుకుంటే రూ. 14,880 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి 11ఏళ్ల పిల్లలకు రూ. 9,780 తీసుకుంటారు.
- కనీసం నలుగురు నుంచి ఆరుగురు కలిసి ట్రిప్ బుక్ చేస్తే.. హోట్లో డబుల్ షేరింగ్ రూం అయితే ఒక్కొక్కరికీ రూ. 15, 560 చార్జ్ చేస్తారు. ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 13,390 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు అయితే రూ. 9,780 చార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో కవర్ అయ్యేవి..
హైదరాబాద్‌లో ఏసీ వసతి కల్పిస్తారు. హోటల్లో రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం అందిస్తారు. ఏసీ రోడ్డు ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ ఉంటుంది. అయితే మధ్యాహ్నం భోజనం పర్యటకులే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్షేత్రస్థాయిలో సందర్శించే ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు పర్యాటకులే కొనుగోలు చేయాలి. హోటల్లో మినరల్ వాటర్, టెలిఫోన్ బిల్, టిప్స్ వంటివి పర్యాటకులే చూసుకోవాలి. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ వెబ్ సైట్ ను సందర్శించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..