Project K: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. డార్లింగ్ లుక్ అదిరింది..

. తాజాగా విడుదలైన పోస్టర్‏లో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంది. పొడవు జుట్టు.. సీరియస్ లుక్‏తో ... శరీరం మొత్తం కవచాలతో కనిపిస్తున్నారు ప్రభాస్. డార్లింగ్ లేటేస్ట్ లుక్ చూసి మాస్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

Project K: 'ప్రాజెక్ట్ కె' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. డార్లింగ్ లుక్ అదిరింది..
Project K
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 19, 2023 | 4:41 PM

ప్రపంచవ్యా్ప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ అప్డేట్ వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది ప్రాజెక్ట్ కె చిత్రయూనిట్. తాజాగా విడుదలైన పోస్టర్‏లో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంది. పొడవు జుట్టు.. సీరియస్ లుక్‏తో … శరీరం మొత్తం కవచాలతో కనిపిస్తున్నారు ప్రభాస్. డార్లింగ్ లేటేస్ట్ లుక్ చూసి మాస్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్యూటీ దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇటీవలే ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించడంతో మరింత హైప్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. ప్రాజెక్ట్ కె విడుదలకు ముందు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక కామిక్ కాన్ వేదికపై ఈ మూవీ టైటిల్ పోస్టర్ రివీల్ చేయనున్నారు. కామిక్ కాన్ వేదికపై టైటిల్ అనౌన్స్ చేయనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె నిలిచింది. ఇప్పటికే చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తుంది. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్స్ కోసం ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడకు చేరుకున్నారు. ఇక మరోవైపు దీపికా, అమితాబ్ సైతం అమెరికా వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి
Prabhas First Look

 

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కిస్తున్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికపై ఈ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేయడమే కాకుండా.. రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇవ్వనుంది చిత్రయూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.