Akira Nandan: అన్న వరుణ్‌ని మించిన హైట్‌తో అకిరా.. లేటెస్ట్ లుక్ వైరల్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అకిరా.. బాల నటుడిగా తల్లి రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అకిరా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే  తప్పకుండా అగ్ర హీరోల్లో ఒకడవుతాడని ఇండస్ట్రీ వర్గాల టాక్ తో పాటు..ఫ్యాన్స్ అంచనాలు కూడా..

Akira Nandan: అన్న వరుణ్‌ని మించిన హైట్‌తో అకిరా.. లేటెస్ట్ లుక్ వైరల్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
Akira Nandan
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2023 | 9:09 AM

పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 18 ఏళ్ల అకిరా లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు.. అకిరా.. పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫోటోలను జతచేసి.. జూనియర్ పవర్ స్టార్ అంటూ తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. అంతేకాదు సినిమాల్లోకి పవన్ వారసుడిగా ఎంట్రీ ఇస్తే.. సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తాడంటూ అభిమానులు తమ అభిమానాన్ని వెల్లడిస్తున్నారు.

అకిరా నందన్ కు సోషల్ మీడియాలో రోజు రోజుకీ ఓ రేంజ్ లో క్రేజ్ పెరుగుతోంది.. అయితే అకిరా ప్రస్తుతం విదేశాల్లో తన చదువుని కొనసాగిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటి వాటిల్లో మంచి ప్రావీణ్యం ఆన్న అకిరా.. బాల నటుడిగా తల్లి రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అకిరా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే  తప్పకుండా అగ్ర హీరోల్లో ఒకడవుతాడని ఇండస్ట్రీ వర్గాల టాక్ తో పాటు..ఫ్యాన్స్ అంచనాలు కూడా.. ఎందుకంటే..అప్పుడు అకిరా అందరికంటే మంచి పొడవున్న హీరోగా మారతాడు. ఇప్పటి వరకూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా(6’5″) హైట్ ఉన్న హీరో.. అయితే ఇప్పుడు అకిరా అన్న వరుణ్ ని మించి పొడవున్నాడు.. తన తాతగారైన కొణిదెల వెంకట్రావులా మంచి పొడవు అకిరా.. తన కెరీర్ ని ఎలా మలచుకుంటాడో చూడాలి మరి.

వాస్తవానికి వారసత్వంగా తండ్రి అడుగులో తనయులు ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది.. తమకంటూ ఒక శైలిలో ని సృష్టించుకుని సారికొత్త పంథాలో వెళ్తేనే ఎంచుకున్న రంగంలో సక్సెస్ అందుకుంటారు. ఇదే విషయం సినిమా నటీనటులకు మాత్రమే కాదు.. వ్యాపార రంగంలో కూడా రుజువు అవుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..