Dasara Movie Review: నేచురల్ స్టార్ నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్.. దసరా మూవీ ఫుల్ రివ్యూ

దసరా.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తున్న పేరు. నాని కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. మరి దసరాలో నిజంగానే అంత మ్యాటర్ ఉందా..? సినిమా ఎలా ఉంది..?

Dasara Movie Review: నేచురల్ స్టార్ నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్..  దసరా మూవీ ఫుల్ రివ్యూ
Dasara
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 30, 2023 | 1:12 PM

మూవీ రివ్యూ: దసరా

చిత్రం: దసరా నటీనటులు: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సి, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

దసరా.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తున్న పేరు. నాని కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. మరి దసరాలో నిజంగానే అంత మ్యాటర్ ఉందా..? సినిమా ఎలా ఉంది..? నాని పాన్ ఇండియన్ ఆశల్ని ఈ సినిమా నిలబెడుతుందా..? అవన్నీ రివ్యూలో చూద్దాం..

కథ: తెలంగాణలోని వీర్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్), సూరి (దీక్షిత్ శెట్టి) మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. వెన్నెలను చిన్నపుడే ప్రేమించే ధరణి.. తన ప్రేమను స్నేహితుడు సూరి కోసం త్యాగం చేస్తాడు. వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నెల కూడా సూరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అయితే అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఊరి రాజకీయాల కారణంగా సిల్క్ బార్ గొడవ పెద్దదవుతుంది. ఆ రాజకీయం ధరణి జీవితంలో పెను మార్పుకు దారి తీస్తుంది. అదేంటి..? అంతగా ప్రేమించిన సూరిని కాకుండా ధరణిని వెన్నెల ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది..? దానికి ముందు ఏం జరిగింది..? అసలు ఆ ఊళ్లో ఉండే చిన్న నంబి (షైన్ టామ్ చాకో)కు ఏంటి సంబంధం..? అనేది మిగిలిన కథ..

కథనం: దసరా సినిమా కథ అంతా తెలంగాణ ప్రాంతంలోనే జరుగుతుంది.. అందులోనూ పక్కా గోదావరిఖని ప్రాంతం నేపథ్యం కావడంతో భాష కూడా అక్కడే ఉంటుంది. అందులో సగం పదాలు ఇప్పుడే కొత్తగా వింటున్న వాళ్లు కూడా లేకపోలేదు. అంత మూలాల్లోకి వెళ్లి ఈ సినిమా తీసాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈయన కథను నమ్మాడు.. అదేం కొత్తది కాకపోవచ్చు కానీ నానికి మాత్రం పూర్తిగా కొత్త కథ. అందుకే గుడ్డిగా నమ్మి ముందడుగు వేసాడు.. దర్శకుడు కొత్తవాడే అయినా కూడా కంటెంట్‌పై నమ్మకంతో ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. దాన్ని చాలా వరకు నిరూపించుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. మొదటి 15 నిమిషాల్లోనే కథ మొత్తం రివీల్ చేసాడు దర్శకుడు. ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా కథ అంతా ధరణి, వెన్నెల, సూరి పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాళ్ల స్నేహం.. తర్వాత సూరి కథలో ట్విస్టు.. ధరణి, వెన్నెల ఒక్కటవ్వడం ఇవన్నీ ఎమోషనల్‌గా కుదిరాయి. ఇంటర్వెల్ సీన్ అయితే నెక్ట్స్ లెవల్ అంతే. ఈ మధ్య కాలంలో అంత రియలిస్టిక్ సీన్స్ అయితే రాలేదు. సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెంచేసాడు దర్శకుడు ఈ ట్విస్టుతో. అయితే సెకండాఫ్ ఎక్కువగా ఎమోషనల్‌గా నడిపించాడు. అక్కడ కాస్త బ్రేకులు పడ్డట్లు అనిపించినా.. ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ మొదలైందో అప్పట్నుంచి ఎండ్ కార్డ్ పడేవరకు ఆగలేదు దసరా. ఓవరాల్‌గా తెలిసిన కథ అయినా కూడా ఆసక్తకరంగా నడిపించాడు.

నటీనటులు: నాని చంపేసాడు.. జీవించేసాడు.. ధరణి పాత్ర కోసమే పుట్టాడు అనిపించాడు. ఆయనెందుకు దీన్ని ప్రేమించాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ కారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయాడు నాని. అది కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. అలాగే కీర్తి సురేష్ కూడా మహానటిని గుర్తు చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే మొదటి సీన్‌లో అద్భుతంగా నటించింది కీర్తి. మరో కీలక పాత్రలో దీక్షిత్ చాలా బాగున్నాడు. సముద్రఖని, సాయి కుమార్ లాంటి వాళ్లు కారెక్టర్‌కు తగ్గట్లు నటించారు. మిగిలిన వాళ్లు ఓకే..

టెక్నికల్ టీం: సంతోష్ నారాయణన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. మరీ ముఖ్యంగా చంకీల అంగీలేసి పాటకు మంచి రెస్పాన్స్ ఉంది. ఎడిటింగ్ కాస్త వీక్‌గా ఉంది. సెకండాఫ్ ఫస్ట్ అరగంట స్లోగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల చాలా వరకు సక్సెస్ అయ్యాడు. తను అనుకున్న కథను అనుకున్నట్లుగా స్క్రీన్ మీద చూపించాడు. మరో మంచి దర్శకుడు అయితే ఇండస్ట్రీకి దొరికాడు. కానీ ఎమోషన్స్ డీలింగ్ విషయంలో వెనకబడ్డాడు. నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు.. కథకు అవసరమైనట్లు ఖర్చు చేసారు.

పంచ్ లైన్: దసరా.. రా అండ్ రస్టిక్..