Ram Charan Birthday: తనయుడికి స్పెషల్ విషెస్ చెప్పిన చిరు.. బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..
చరణ్, తారక్ కలిసి నటించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఆస్కార్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో తాను సాధించలేనిది తన కొడుకు అతి తక్కువ సమయంలోనే సాధించాడంటూ ఇటీవల చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఆయన తనయుడు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోవడంతో చిరు సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించడంతోపాటు… తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చరణ్. అంతేకాకుండా చరణ్, తారక్ కలిసి నటించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఆస్కార్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో తాను సాధించలేనిది తన కొడుకు అతి తక్కువ సమయంలోనే సాధించాడంటూ ఇటీవల చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మరోసారి తన తనయుడిపై ప్రేమ కురిపించారు మెగాస్టార్.
‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. హ్యాపీ బర్త్ డే’ అంటూ తనయుడిని ముద్దాడుతున్న ఫోటోలను షేర్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. చెర్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. సీని ప్రముఖులు. అతి తక్కువ సమయంలోనే చరణ్ గ్లోబల్ స్టార్ ఎదగడమే కాకుండా.. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
మరోవైపు చెర్రీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు. చెర్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడితో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Proud of you Nanna.. @AlwaysRamCharan Happy Birthday!! ?? pic.twitter.com/JnDXc50N8W
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
Wishing a Happy Happy birthday to our dearest @AlwaysRamCharan garu ???????..Many Many Happy Returns Sir???#HBDGlobalStarRamCharan pic.twitter.com/Fj48oaEWPH
— vennela kishore (@vennelakishore) March 27, 2023
Wishing our RAM, @alwaysramcharan a very Happy Birthday ???? Best wishes to all your future endeavours ❤️❤️❤️#HBDGlobalStarRamCharan pic.twitter.com/Iu19M36Z7X
— RRR Movie (@RRRMovie) March 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.