Supreme Movie: సుప్రీమ్ సినిమాలోని ఈ చిన్నోడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా మారాడో తెలుసా..
తెలుగు ప్రేక్షకులను తమ మాటలు.. నటనతో ఆకట్టుకున్న బాలనటులలో సుప్రీం సినిమా చిన్నోడు ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ బుడ్డొడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మైకేల్ గాంధీ.
చిన్న వయసులోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ప్రేక్షకులకు దగ్గరయినవారు చాలా మంది ఉన్నారు. చేసింది ఒకటి రెండు చిత్రాలు అయినా.. ఇప్పటికీ ఆడియన్స్ కు గుర్తుండిపోయారు. అమాయకత్వం.. ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్నారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్స్ తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అందులో కొందరు ప్రస్తుతం హీరోలుగా.. సహాయ నటీనటులుగా అలరిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులను తమ మాటలు.. నటనతో ఆకట్టుకున్న బాలనటులలో సుప్రీం సినిమా చిన్నోడు ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ బుడ్డొడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మైకేల్ గాంధీ.
మైకేల్ గాంధీ. సుప్రీమ్ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ చిన్నోడి వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. 2016 మే 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇందులో రాజన్ గా చిన్నోడు మైకేల్ గాంధీ కనిపించాడు. ఈ మూవీ తర్వాత అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాలో నటించాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ నటించి మెప్పించాడు మైకేల్.
అయితే హలో, సుప్రీమ్ సినిమాల్లో నటించిన మైకేల్ ఇప్పటికీ సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. సచిన్ టెండూల్కర్ బయోపిక్ లో చిన్ననాటి సచిన్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం మైకేల్ చాలా మారిపోయాడు. ఇటీవల ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకున్న మై లో కనిపించాడు మైకెల్. ఈ చిన్నోడు సోషల్ మీడియాలో యాక్టివ్. తన ఫ్యామిలీ ఫోటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.