Chalapathi Rao: మంచి మిత్రుడిని కోల్పోయాను.. చలపతిరావు పార్థివ దేహానికి చిరంజీవి నివాళులు

ప్రముఖ సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని నటుడు రవిబాబు ఇంటికి చేరుకున్న ఆయన చలపతిరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

Chalapathi Rao: మంచి మిత్రుడిని కోల్పోయాను.. చలపతిరావు పార్థివ దేహానికి చిరంజీవి నివాళులు
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2022 | 2:10 PM

ప్రముఖ సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణంపై మెగాస్టార్‌ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని నటుడు రవిబాబు ఇంటికి చేరుకున్న ఆయన చలపతిరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. నటుడు రవిబాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ‘ ఈడిసెంబర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని వేదన కలిగించింది. వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. మద్రాసులో ఉన్నప్పటి నుంచే మాకు అనుబంధం ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నేను నటించాను. ఆయన మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయాను. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. రవిబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని తెలిపారు చిరంజీవి. అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా కూడా చలపతిరావుకు సంతాపం తెలిపారు మెగాస్టార్

చిరంజీవితో పాటు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు, సుధీర్‌ బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, దిల్లీ రాజేశ్వరి, అచ్చిరెడ్డి, నందమూరి రామకృష్ణ, అనిల్ రావిపూడి, సాయిధరమ్‌ తేజ్‌, గోపిచంద్‌ మలినేని, మంత్రి రోజా సెల్వమణి, బాబీ, కాశీ విశ్వనాథ్, తరుణ్‌ తదితరులు నివాళులు అర్పించారు. కాగా చలపతిరావు కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉంది. దీంతో ఆయన అంత్యక్రియలు ఆలస్యం కానున్నాయి. బుధవారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారుడు నటుడు రవిబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..