Kajal Aggarwal: చందమామ వచ్చేస్తోంది.. చాలా సంతోషంగా ఉందన్న కాజల్

చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది.

Kajal Aggarwal: చందమామ వచ్చేస్తోంది.. చాలా సంతోషంగా ఉందన్న కాజల్
Kajal
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 01, 2023 | 6:54 AM

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో గడుపుతున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది. మగధీర సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి. దాంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ భామ. కెరీర్ పీక్ లో ఉండగానే తన స్నేహితుడు అయినా గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న కాజల్ ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రావాలని చూస్తోంది.

ఆమె చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను తొలిగించారు. ఇక ఇప్పుడు కాజల్ కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 లో చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే కొంతం భాగం షూటింగ్ జరుపుకొని ఆ తర్వాత బ్రేక్ ఇచ్చారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే గుర్రపు స్వారీ కూడా నేర్చుకుందట. చాలాకాలం తరవాత తిరిగి పనిలోకి రావడం సంతోషంగా ఉందని, కొత్త విషాలు నేర్చుకొని వాటిని అలవాటుగా చేసుకోవడం తనకు ఇష్టమని తెలిపింది. త్వరలోనే భారతీయుడు 2 సెట్ లో అడుగు పెట్టనుంది కాజల్.