NTR : యంగ్ టైగర్ బాలీవుడ్‌లో సినిమా చేయనున్నారా..? ఆయన అందుకే తారక్ ను కలిశారా..?

ట్రిపుల్ ఆర్ సినిమాతో.. ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్.. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ టీ సిరీస్ ఓనర్‌ భూషణ్‌ కుమార్‌తో.. క్లోజ్‌గా ఉంటున్నారు. తరుచుగా కలుస్తున్నారు.

NTR : యంగ్ టైగర్ బాలీవుడ్‌లో సినిమా చేయనున్నారా..? ఆయన అందుకే తారక్ ను కలిశారా..?
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2023 | 7:49 PM

“ఎవరూ ఊరికే రారు.! ఎవరూ ఊరికే వెళ్లరు.? ఏదో మత్‌లబ్‌ ఉండే ఉంటుంది. ఇంకేదో పెద్దగానే జరగబోతోంది. ఈ సారి దద్దరిల్లిపోవడం ఖాయంగా ఉంది!” ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి నెటిజెన్స్ అంటున్న మాటలు.. చేస్తున్న కామెంట్స్ ! మరి మన హీరోను ఇలా ఎందుకంటున్నారని అంటారా.? అది తెలియాలంటే ఈ స్టోరీని తెలియాల్సిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో.. ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్.. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ టీ సిరీస్ ఓనర్‌ భూషణ్‌ కుమార్‌తో.. క్లోజ్‌గా ఉంటున్నారు. తరుచుగా కలుస్తున్నారు. ఏదో పాన్ ఇండియన్ సినిమానే ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో వైరల్ అయిపోతున్నారు.

అంతేకాదు రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 మూహూర్త కార్యక్రమానికి ఈయన వెళ్లిన విషయాన్ని బాలీవుడ్‌ మీడియా వారే గుర్తు చేస్తున్నారు. ఎవరూ ఊరికే వెళ్లరు కదాని అంటున్నారు. డెఫనెట్‌గా టీ సిరీస్‌ ప్రొడ్యూసర్‌తో.. టాలీవుడ్‌ బాద్‌షా బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని మోహమాటం లేకుండా చుబుతున్నారు. ఈ విషయాన్ని తారక్‌ కు.. తారక్‌ ఫ్యాన్స్‌కు ట్యాగ్‌ చేసి మరీ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ 30 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్, జాన్వీ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమానుంచి మేజర్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సారి కొరటాల శివ సాలిడ్ సక్సెస్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.