Kriti Kharbanda: అందం, అభినయం ఉన్న ఆఫర్స్ మాత్రం అందని ద్రాక్ష అవుతున్నాయే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన మిస్టర్ నూకయ్య సినిమాలో కనిపించింది.
కృతి కర్భంద.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన మిస్టర్ నూకయ్య సినిమాలో కనిపించింది. అందం అభినయం ఉన్న ఈ చిన్నది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. టాలీవుడ్ లో ఆఫర్స్ దగ్గడంతో ఈ భామ బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత బోణి అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తెలుగులో బోణి, అలామొదలైంది, తీన్ మార్, మిస్టర్ న్యూకయ, ఒంగోలు గిత్త, ఓం 3డి, బ్రుస్ లీ సినిమాల్లో నటించింది. ఇక చివరిగా నటించిన బ్రుస్ లీ సినిమాలో రామ్ చరణ్ అక్కగా నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంది. సినిమాలతో పాటు అక్కడ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది./ అయితే అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఒక్క సాలిడ్ హిట్ పడితే రేంజ్ మారిపోతుందని ఆశగా చూస్తుంది ఈ చిన్నది.
ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది కృతి. హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ భామ. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకాక్రుకు కిర్రెక్కిస్తున్నాయి. క్లివేజ్ షో తో కాకరేపుతోంది. అయితే ఈ అందమంతా అడవి కాచిన వెన్నల అవుతోందని.. ఆమెకు బడా మూవీలో ఛాన్స్ వస్తే బాగుండు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram