Sukumar-Pawan: సెట్ మీద ఉన్న సమయంలో నా అనారోగ్య సమస్యను పవన్‌ కళ్యాణే గుర్తించారన్న డైరెక్టర్

తన షూటింగ్ జరుగుతున్న సెట్‌కు.. పక్కనే త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్ సినిమా షూట్ కూడా జరుగుతుండడంతో.. అక్కడికి వెళ్లి ఆయన పక్కనే కూర్చున్నారట. కాని పవన్‌ ను కదిలించలేక.. కాసేపు అక్కడే ఉండి.. వెళ్లిపోయారట.

Sukumar-Pawan: సెట్ మీద ఉన్న సమయంలో నా అనారోగ్య సమస్యను పవన్‌ కళ్యాణే గుర్తించారన్న డైరెక్టర్
Pawan Kalyan And Sukumar
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2022 | 9:22 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా.. తనదైన శైలితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ఫేమ్ ని సంపాదించుకున్నారు. అందరి హీరోలకు అభిమానులుంటారు..  కానీ పవన్ కళ్యాణ్ భక్తులుంటారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ పవన్ కళ్యాణ్ ని ఇష్టపడతారు.. అయన గురించి ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతుంటారు. ఒకరేమో… అతనిని ‘దేవర’ అంటారు. మరొకరేమో తన ఫిల్మ్ కెరీర్‌కు ‘లైఫ్‌ గాడ్’ అంటారు. ఇంకొకరేమో.. అజాత శత్రువని.. వేరొకరేమో మంచి మిత్రుడని.. మరొకరేమో ట్రూ పవర్ స్టార్ అని.. ఇలా ఎందరో ఎన్నో రాకాలుగా అంటూ ఉంటారు. వేదికల మీద.. ఇంటర్య్వూల్లో ఆయన్ని.. ఆయన గొప్పతన్నాన్ని కొనియాడుతూనే ఉంటారు. కాని పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఆయన గొప్పతన్నాన్ని..! తనమీద ఆయన చూపించిన కన్‌సర్న్‌ తో… తన ఆరోగ్యం పై పవన్‌ చూపించిన శ్రద్దతో చెప్పారు. తన మాటలతో.. పవన్‌ మంచితనాన్ని కాస్త కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

అవును అందరిలాగే పవన్‌ ను ఒక్క సారైనా మీట్ అవ్వాలని.. మాట్లాడలని తన కెరీర్ బిగినింగ్ నుంచే అనుకున్న.. సుక్కు..! అందుకోసం ప్రయత్నిస్తూనే ఉన్న సుక్కు..! ఓ ఫైన్ డే ఆయన్ను మీట్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. తన షూటింగ్ జరుగుతున్న సెట్‌కు.. పక్కనే త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్ సినిమా షూట్ కూడా జరుగుతుండడంతో.. అక్కడికి వెళ్లి ఆయన పక్కనే కూర్చున్నారట. కాని పవన్‌ ను కదిలించలేక.. కాసేపు అక్కడే ఉండి.. వెళ్లిపోయారట.

అయితే ఇదంతా గమనించిన పవన్‌.. ఆ వెంటనే త్రివిక్రమ్‌ను పిలిచి.. “డైరెక్టర్ సుకుమార్ వచ్చారు. కాని ఆయాస పడుతున్నారు. నేనే మాట్లాడుదాం అని అనుకునే లోపే వెళ్లి పోయారు. ఎందుకైనా మంచిది తనని ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడమని చెప్పండి. ఆయాసం రాకుండా వర్కవుట్స్ చేయమని చెప్పండి” అంటూ సుక్కు ఆరోగ్యం గురించి త్రివిక్రమ్‌ కు చెప్పారట. సుక్కుకు తన మాటలు చెప్పమని చెప్పారట.  ఈ విషయాలు.. త్రివిక్రమ్‌ సుక్కుకు చెప్పడంతో.. సుక్కు ఒక్కసారిగా షాకయ్యారట. తన మీద పవన్‌ చూపించిన కన్‌సర్న్‌ కు ఫిదా అయిపోయారట. ఇక ఇదే విషయాన్ని ఓ ఈవెంట్లో పవన్‌ ముందే చెప్పి.. ఆ వీడియోతో అప్పట్లో నెట్టింట వైరల్ కూడా అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..