NTR 30: ఎన్టీఆర్ 30 బ్యాక్డ్రాప్ చెప్పేసిన డైరెక్టర్ కొరటాల శివ.. మృగాళ్లతో పోరాడనున్న యంగ్ టైగర్..
తారక్, జాన్వీ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు జక్కన్న క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న NTR30 సినిమా మొదలైంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాం గురువారం ఉదయం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ ను చూసి షాకయ్యాడు. ఇక ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, నిర్మాత కళ్యాణ్ రామ్ సందడి చేశారు. అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేశారు. తారక్, జాన్వీ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు జక్కన్న క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ కార్యక్రమం అనంతరం డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 30 బ్యాక్ డ్రాప్ చెప్పేశారు. “జనతా గ్యారేజ్ తర్వాత నా సోదరుడు. ఈ జనరేషన్ లో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన ఎన్టీఆర్ తో కలిసి మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విస్మరణకు గురైన ఓ తీరప్రాంత బ్యాక్ డ్రాప్ లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్ డ్రాప్. భయం ఉండాలి.. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధా పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయలో తీసుకువస్తున్నాం.
నా కెరీయర్ లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నాను. ఈ కథ చెప్పిన వెంటనే ఫైర్ తో రాశారు సర్. అని అనిరుధ్ అన్నాడు. ఇలాంటి టీంతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది ” అని అన్నారు కొరటాల శివ. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తోన్న సినిమా కావడం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.