Samyuktha: ‘విరూపాక్ష’ చిత్రయూనిట్‏పై హీరోయిన్ అలక.. ఉగాది స్పెషల్ అప్డేట్ పై సంయుక్త హర్ట్ అయ్యింది..

సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రమోషన్లలో కేవలం స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా.. హీరోయిన్లకు కూడా ప్రాధాన్యమే దక్కుతుంటుంది. వాళ్ల పుట్టినరోజులు.. ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు చూసుకుని స్పెషల్ పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా హీరోయిన్ సంయుక్త విరూపాక్ష చిత్రయూనిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది.

Samyuktha: 'విరూపాక్ష' చిత్రయూనిట్‏పై హీరోయిన్ అలక.. ఉగాది స్పెషల్ అప్డేట్ పై సంయుక్త హర్ట్ అయ్యింది..
Samyuktha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2023 | 8:36 AM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి విడుదలయ్యే వరకు వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇక సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయకముందే ప్రత్యేకమైన సందర్భాల్లో మూవీ పై ఆసక్తి క్రియేట్ చేసేందుకు పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూరు కాకముందే వరుస అప్డే్ట్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఉగాది సందర్భంగా వరుస అప్డేట్స్ ఇస్తూ.. సినీ ప్రియులను ఆకట్టుకున్నారు ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు. ఇక సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రమోషన్లలో కేవలం స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా.. హీరోయిన్లకు కూడా ప్రాధాన్యమే దక్కుతుంటుంది. వాళ్ల పుట్టినరోజులు.. ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు చూసుకుని స్పెషల్ పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా హీరోయిన్ సంయుక్త విరూపాక్ష చిత్రయూనిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో తనకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వలేదని ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని తెలిపింది.

భీమ్లా నాయక్, బింబిసార, సార్ వంటి సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉంది మలయాళీ బ్యూటీ సంయుక్త. ప్రస్తుతం ఆమె సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న విరూపాక్ష చిత్రంలో నటిస్తుంది. ఐతే ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోల్లో ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు. అయితే ఉగాది సందర్భంగా సందర్భంగా బుధవారం తన పోస్టర్ రిలీజ్ చేస్తారని హామీ ఇచ్చి.. ఆ మాట నిలబెట్టుకోలేదంటూ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీని ట్యాగ్ చేసింది. ఐతే ఈ విషయం చెప్పడానికి ముందు ఆ సినిమా కోసం పనిచేయడం చాలా సంతోషమని పేర్కొంటూ నిర్మాణ సంస్థను కొనియాడింది. కానీ తన పోస్టర్ రిలీజ్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక సంయుక్త ట్వీట్ కు వెంటనే ఎస్వీసీసీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి స్పందన వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల పోస్టర్ రిలీజ్ చేయలేదని.. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఇక సంయుక్త ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.