Ashu Reddy: పవన్‌పై మరోసారి అభిమానం చాటుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఆ సినిమా ఫస్ట్‌ షో కోసం జాబ్‌ కూడా వదులుకున్నానంటూ..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అంటే పడి పచ్చే వారిలో అభిమానులే కాదు ఎందరో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అందులో బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఒకరు. పవర్‌స్టార్‌పై తనుకున్న అభిమానాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపెట్టిందీ అందాలతార.

Ashu Reddy: పవన్‌పై మరోసారి అభిమానం చాటుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఆ సినిమా ఫస్ట్‌ షో కోసం జాబ్‌ కూడా వదులుకున్నానంటూ..
Ashu Reddy,pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2023 | 1:30 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అంటే పడి పచ్చే వారిలో అభిమానులే కాదు ఎందరో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అందులో బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఒకరు. పవర్‌స్టార్‌పై తనుకున్న అభిమానాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపెట్టిందీ అందాలతార. ఆ మధ్యన పవన్ కల్యాణ్ టాటూలను వేయించుకుని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇటీవల హరి హర వీరమల్లు సినిమా సెట్‌లో పవన్‌ను కలవడం, కాసేపు మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని విషయాలంటూ భావోద్వేగానికి గురైంది. తాజాగా పవన్‌పై అభిమానాన్ని చాటుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ సొగసరి. అదేంటంటే.. పవర్‌ స్టార్‌ నటించిన కాటమరాయుడి సినిమా ఫస్ట్‌ షో చూడడం కోసం ఏకంగా జాబ్‌నే వదులుకుందట. ఇందుకు గానూ కుటుంబ సభ్యులు కూడా ఆమెను తిట్టారట. అయితే ఎప్పుడు కూడా దీనికి రిగ్రెట్‌ కాలేదట. ఆయనకు భక్తురాలిని అవ్వడం తనక ఉఎంతో గర్వంగా ఉందంటూ ఈ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది అషూ రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌ ఫ్యాన్స్‌ ఈ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే మెయిల్‌ నింజగానే పంపావా? డ్రాఫ్ట్‌లోనే ఉంది కదా? మెయిల్‌కు రిప్లై ఏం వచ్చింది? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదైతేనేమీ పవన్ అంటే తనకెంత అభిమానమో మరోసారి చాటుకుంద అషూ రెడ్డి. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేసింది అషూ. అయితే అప్పటికే స్ర్కీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

కాగా జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి బిగ్‌బాస్‌ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ టాక్‌షోతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఆతర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన ఫోకస్ సినిమాలో పోలీస్‌గానూ నటించి మెప్పించింది. ఈ సంగతి పక్కన పెడితే గత కొద్ది రోజులనుంచి సోషల్‌ మీడియాలో అషురెడ్డిపై విపరీతమైన ట్రోలింగ్స్‌ వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ఆర్జీవీతో ఆమె చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా అషు రెడ్డి పాదాల దగ్గర కూర్చుని వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో డైరెక్టర్‌తో పాటు బిగ్‌బాస్‌ బ్యూటీపై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు. దీనిని మరిపించేలా ఇటీవలే అనాథ పిల్లలకు విద్యాదానం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచిందీ సొగసరి.

0

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..