Balagam Venu: భోళాశంకర్‌ సినిమాలో ‘బలగం’ డైరెక్టర్‌.. మెగాస్టార్‌ చేసిన ఆ మంచి పనికి ముగ్ధుడైన వేణు

జబర్దస్త్‌ తర్వాత కొన్నేళ్ల పాటు పెద్దగా కనిపించని వేణు ఏకంగా మెగా ఫోన్‌ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయేలా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను ఇచ్చాడు. అతని టేకింగ్‌కు, డైరెక్షన్‌ ట్యాలెంట్‌కు సినీ ప్రముఖులు సైతం ముగ్ధులవుతున్నారు.

Balagam Venu: భోళాశంకర్‌ సినిమాలో 'బలగం' డైరెక్టర్‌.. మెగాస్టార్‌ చేసిన ఆ మంచి పనికి ముగ్ధుడైన వేణు
Chiranjeevi, Venu
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2023 | 5:40 AM

బలగం సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు యెల్దండి వేణు. ఒకప్పుడు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఈ కమెడియన్‌ బలగం సినిమాతో ఒక్కసారిగా అందరినీ ఏడిపించాడు. జబర్దస్త్‌ తర్వాత కొన్నేళ్ల పాటు పెద్దగా కనిపించని వేణు ఏకంగా మెగా ఫోన్‌ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయేలా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను ఇచ్చాడు. అతని టేకింగ్‌కు, డైరెక్షన్‌ ట్యాలెంట్‌కు సినీ ప్రముఖులు సైతం ముగ్ధులవుతున్నారు. చిన్న సినిమాగా వచ్చిన బలగం దెబ్బకు బాక్సాఫీస్‌ సైతం దద్దరిల్లిపోయింది. వెల్లువలా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓటీటీలోనూ తన బలాన్ని చూపిస్తోందీ ఎమోషనల్‌ మూవీ. ఇదిలా ఉంటే మెగాఫోన్‌ పట్టి హిట్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన వేణు ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు. మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తోన్న భోళా శంకర్‌లో ఓ కీ రోల్‌ చేయనున్నాడు. కాగా బలగం సినిమాను చిత్రీ కరిస్తుండగానే .. మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో వేణుకు ఛాన్స్ అవకాశం వచ్చిందట.

కాగా సిరిసిల్లలో బలగం సినిమా షూటింగ్‌ చేయాల్సిన సమయంలోనే.. ఇటు భోళాశంకర్‌ షూటింగ్‌ చేయాల్సి వచ్చిందట. అయితే అప్పటికే రెండ్రోజుల డేట్లు ఇచ్చాడట వేణు. అయతే అదనంగా మరో రోజు ఉండాల్సివచ్చిందట. భోళా శంకర్‌ సెట్‌లో ఉండిపోతే.. సిరిసిల్లలో చేయాల్సిన బలగం షూటింగ్ ఆలస్యమవుతుంది ఎలా అంటూ వేణు తెగ కంగారు పడిపోయాట. ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి స్వయంగా దిల్ రాజుకు ఫోన్ చేశాడట. వేణు ఒక రోజు ఇక్కడే ఉంటాడు.. కాస్త అడ్జస్ట్ చేసుకోండని దిల్ రాజును రిక్వెస్ట్ చేశాడట. చిరంజీవి చెప్పడంతో దిల్ రాజు కూడా వెంటనే అంగీకరించడట. తన సమస్యలను గుర్తించి దిల్‌రాజుతో స్వయంగా చిరంజీవి మాట్లాడడం చూసి వేణు ఎమోషనల్‌ అయ్యాడట. కాళ్ల మీద పడిపోతూ ఉంటే.. వద్దని బలగం సినిమా బాగా తీయమని ప్రోత్సహించాడట. ఎలాంటి టెన్షన్ లేకుండా నటించమని ఎంకరేజ్ చేశాడట. ఈ విషయాన్ని వేణునే ఓ సందర్భంలో షేర్‌ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..