Neha Shetty: రాధిక మళ్లీ వచ్చేస్తోంది.. డీజే టిల్లు సీక్వెల్‏లో నేహాశెట్టి..

ఈ మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నేహా సెట్టి కథానాయికగా కనిపించింది. ఇందులో రాధిక పాత్రలో నటించింది. ఈ సినిమాకు రాధిక పాత్రే హైలెట్. ముఖ్యంగా గ్లామర్ పరంగా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది నేహాశెట్టి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాధిక పాత్రకు బాగా ఫాలోయింగ్ వచ్చేసింది. సిద్ధు, రాధిక మధ్య వచ్చే డైలాగ్స్ నెట్టింట ఫుల్ వైరలయ్యాయి.

Neha Shetty: రాధిక మళ్లీ వచ్చేస్తోంది.. డీజే టిల్లు సీక్వెల్‏లో నేహాశెట్టి..
Neha Shetty, Dj Tillu 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2023 | 7:31 AM

డీజే టిల్లు.. ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇది. ఈ సినిమాతో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలోని సిద్దు డైలాగ్ డెలివరీ.. మ్యానరిజం ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నేహా సెట్టి కథానాయికగా కనిపించింది. ఇందులో రాధిక పాత్రలో నటించింది. ఈ సినిమాకు రాధిక పాత్రే హైలెట్. ముఖ్యంగా గ్లామర్ పరంగా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది నేహాశెట్టి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రాధిక పాత్రకు బాగా ఫాలోయింగ్ వచ్చేసింది. సిద్ధు, రాధిక మధ్య వచ్చే డైలాగ్స్ నెట్టింట ఫుల్ వైరలయ్యాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇందులో మరోసారి సిద్ధు హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్ గా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.

కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.

ఈ సినిమా క్లైమాక్స్ లో డీజే టిల్లులోని రాధిక క్యారెక్టర్ చేసిన నేహాశెట్టి గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నేహాశెట్టి తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. యంగ్ హీరో కార్తికేయ నటిస్తోన్న బెదురులంక 2012 చిత్రంలో నటిస్తుంది. అలాగే టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలోనూ నటిస్తుంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.