Gouri Kishan: షాకింగ్ ఫోటో రివీల్ చేసిన ’96’ బ్యూటీ.. ఆ ప్లేస్లో టాటూ వేయించుకున్న గౌరి..
ఇటీవలే తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో కథానాయికగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో గౌరికి క్రేజ్ రాలేదు. ఇప్పటికీ 96 చిత్రంలోని టీనేజ్ త్రిషగానే ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే ఇప్పటివరకు ట్రెడిషనల్ క్యూట్ పిక్స్ షేర్ చేసిన గౌరి.. తాజాగా తన ఇన్ స్టాలో షాకింగ్ పిక్ పోస్ట్ చేసింది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన సినిమా 96. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందమైన ప్రేమకథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ కంటే ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ట్స్ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా త్రిష టీనేజ్ అమ్మాయిగా కనిపించిన గౌరి ప్రస్తుతం హీరోయిన్గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో కథానాయికగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో గౌరికి క్రేజ్ రాలేదు. ఇప్పటికీ 96 చిత్రంలోని టీనేజ్ త్రిషగానే ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే ఇప్పటివరకు ట్రెడిషనల్ క్యూట్ పిక్స్ షేర్ చేసిన గౌరి.. తాజాగా తన ఇన్ స్టాలో షాకింగ్ పిక్ పోస్ట్ చేసింది.
నడుముకు పై భాగంలో కుడి చేయి కిందవైపు వేయించుకుంది. దానిని రిబ్ టాటూ అంటారు. ఇక తన టాటూని ఫోటో తీసి ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ గౌరిని విమర్శిస్తున్నారు. నువ్వు కూడా ఇలా చేస్తున్నావా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో గౌరి చేసింది కేవలం రెండు సినిమాలే. ఒకటి చైల్డ్ ఆర్టిస్ట్ గా జాను చిత్రం కాగా.. మరొకటి సంతోష్ శోభన్ సరసన శ్రీదేవి శోభన్ బాబు సినిమా.
అయితే ఈ మూవీ ప్లాప్ అవ్వడంతో గౌరికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డే్ట్ రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం తమిళం, మలయాళంలో మాత్రమే నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.