Oscar Awards: ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అరుదైన గౌరవం.. ఆస్కార్ ప్యానెల్ సభ్యుల జాబితాలో చోటు..
అలాగే హాలీవుడ్ దర్శకనిర్మాతలు ట్రిపుల్ ఆర్ టీంపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచం దృష్టిని తెలుగు సినిమా వైపు తీసుకువచ్చింది ఈ సినిమా. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రబృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ ప్యానెల్ సభ్యుల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఆస్కార్ సంస్థ అకాడమీలో మెయిన్ కమిటీ కాకుండా వరల్డ్ వైడ్ గా పదివేల మంది సభ్యులు ఉన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా.. సినీపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్గా సినీప్రియులను ఊర్రూతలూగించింది. అలాగే హాలీవుడ్ దర్శకనిర్మాతలు ట్రిపుల్ ఆర్ టీంపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచం దృష్టిని తెలుగు సినిమా వైపు తీసుకువచ్చింది ఈ సినిమా. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రబృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ ప్యానెల్ సభ్యుల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఆస్కార్ సంస్థ అకాడమీలో మెయిన్ కమిటీ కాకుండా వరల్డ్ వైడ్ గా పదివేల మంది సభ్యులు ఉన్నారు.
అకాడమీ సభ్యులుగా వివిధ కేటగిరీలలో ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలలోంచి పలువురు ఉంటారు. ఇక ఇప్పుడు కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి చెందిన ఆరుగురు ఉండడం విశేషం. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తోపాటు.. సంగీతం దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, అలాగే ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్ కు అకాడమీ కమిటీలో స్థానం దక్కింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వీరితోపాటు.. మణిరత్నం, కరణ్ జోహార్లకు ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది. అలాగే డాక్యుమెంటరీ విభాగంలో షౌనక్ సేన్ ఇండియా నుంచి వెళ్లనున్నారు. ఇక వీరింతా వాటిని యాక్సెప్ట్ చేస్తే అకాడమీ మెంబర్స్ గా గుర్తించబడతారు. ఇక వీరు వచ్చే ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచిన సినిమాలకు ఓట్లు వేయొచ్చు. అయితే ఈ అకాడమీలో డైరెక్టర్ రాజమౌళికి చోటు దక్కి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
We’re proud to announce our newly invited members to the Academy!
Meet the Class of 2023: https://t.co/xElbKejirD pic.twitter.com/9IqEmbU6GD
— The Academy (@TheAcademy) June 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.