Paluke Bangaramayena: ‘గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం’.. సరికొత్త సీరియల్ పలుకే బంగారమాయెనా..
ఇక ఇప్పుడు మరో కొత్త సీరియల్ టీవీలో అలరించేందుకు సిద్ధమవుతుంది. అదే పలుకే బంగారమయేనా. ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ సీరియల్ ప్రోమోస్ వస్తున్నాయి. ఇందులో కథానాయికకు నత్తి ఉండగా.. ఏమాత్రం ఇష్టపడని తండ్రి. అయినా న్యాయం వైపు నిలబడే కూతురు.. తన జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ఎలా ఎదుర్కొనబోతుందనేదీ సీరియల్. ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. అంతకు మించి ఎన్నో ఆశలను కూడా నేర్పిస్తుంది.
బుల్లితెరపై సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మహిళలకు సీరియల్స్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పుకోవాలి. ఇటీవల పలు సీరియల్స్ అత్యథిక వ్యూస్ అందుకుంటా టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి.. అందుకు కారణం రోటీన్ స్టోరీస్ కాకుండా… ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యతతో తీసుకువస్తున్నారు. అమ్మాయిల చదువు.. ఆత్మవిశ్వాసం.. కుటుంబానికి అండంగా నిలబడే ధైర్యం.. ఇలాంటి కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తున్నాయి సీరియల్స్. ఇక ఇప్పుడు మరో కొత్త సీరియల్ టీవీలో అలరించేందుకు సిద్ధమవుతుంది. అదే పలుకే బంగారమయేనా. ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ సీరియల్ ప్రోమోస్ వస్తున్నాయి. ఇందులో కథానాయికకు నత్తి ఉండగా.. ఏమాత్రం ఇష్టపడని తండ్రి. అయినా న్యాయం వైపు నిలబడే కూతురు.. తన జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ఎలా ఎదుర్కొనబోతుందనేదీ సీరియల్. ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. అంతకు మించి ఎన్నో ఆశలను కూడా నేర్పిస్తుంది.
ఇక అవే తాము ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇదే కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ “పలుకే బంగారమాయెనా”. రెండు కలసి నడిచి నిజాలుగా మార్చుకున్న కథ ఇది. వాళ్లు పుట్టుకతో పరాజితులే గానీ తమ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలా నిలబడ్డారు అనే విలక్షణ మైన కథతో రాబోతుంది ఈ సీరియల్. ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది పలుకే బంగారమాయెనా. గెలుపే గమ్యమైన ఆ ఇద్దరి ప్రయాణంలో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు వుంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులువుంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది.
పలుకే బంగారమాయెనా సీరియల్ పోస్ట్..
View this post on Instagram
ఏదో సాధించాలనే తపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేని నిస్సహాయ పరిస్థితి.. అదే సమయంలో ఆమె జీవితంలోకి అతని రాక ఒక మలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమె ఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్ద చేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది “పలుకేబంగారమాయెనా” కథ.
పలుకే బంగారమాయెనా సీరియల్ పోస్ట్..
View this post on Instagram
తడబడే అడుగుల నుంచి వడి వడి నడకలా వరకు ఒక జంట ఎంత అపురూపంగా ప్రయాణంచేసిందో అద్భుతంగా చెప్పిన ధారావాహిక స్టార్ మా ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతోంది. ఓడించాలనుకున్న జీవితాన్నిగెలుచుకున్న ఆ ఇద్దరూ, వాళ్ళ కుటుంబాలు తెలుగు లోగిళ్ళలో ప్రతి కుటుంబానికి నచ్చుతాయి. మిస్ అవ్వకండి.
పలుకే బంగారమాయెనా సీరియల్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.