OTT Movies: ఈవారం అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌ల లిస్టు ఇదే

ఓటీటీలు మాత్రం ఎప్పుడూ ఒకే ఫార్ములాను ఫాలో అవుతాయి. ప్రతి వారమూ కొత్త కొత్త సినిమాలతో ముస్తాబవుతుంటాయి. సినిమా ప్రియుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ భాషల్లో హిట్టైన సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి.

OTT Movies: ఈవారం అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌ల లిస్టు ఇదే
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2023 | 6:20 AM

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫిబ్రవరి గడ్డుకాలమని భావిస్తారు. ఎందుకంటే ఈనెలలో విద్యార్థుల పరీక్షల ఈ మాసం నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అందుకే ఈ నెలలో పెద్దగా థియేటర్‌ రిలీజులుండవు. ఎక్కువగా చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అయితే దీనికి భిన్నంగా ఓటీటీలు మాత్రం ఎప్పుడూ ఒకే ఫార్ములాను ఫాలో అవుతాయి. ప్రతి వారమూ కొత్త కొత్త సినిమాలతో ముస్తాబవుతుంటాయి. సినిమా ప్రియుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ భాషల్లో హిట్టైన సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వివిధ భాషల్లో హిట్టైన సినిమాలతో పాటు గతంలో థియేటర్లలో రిలీజైన హిట్‌ మూవీస్‌ను లోకల్‌ లాంగ్వెజెస్‌కు అనుగుణంగా రిలీజ్‌ చేస్తున్నాయి. అలాగే కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇక ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది కాబట్టి.. మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయిపోయాయి. మరి ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్ లేంటో చూద్దాం రండి.

నెట్ ఫ్లిక్స్

  • వాల్తేరు వీరయ్య ( ఆల్‌రెడీ స్ట్రీమింగ్ )
  • హీట్ వేవ్ (ఇంగ్లిష్) – మార్చి 1
  • సెక్స్ లైఫ్ ( వెబ్‌ సిరీస్) – మార్చి 2
  • తలైకుతాల్ (తమిళ్‌) – మార్చి 3

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌)- మార్చి 3

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ది మాండలోరియన్‌ (వెబ్‌సిరీస్‌3)- మార్చి 1
  • ఎలోన్‌ (మలయాళం/తెలుగు)- మార్చి 3
  • గుల్మొహర్‌ (హిందీ)- మార్చి 3

డాక్యూ బే

హోండురస్, ట్రంప్ & ది గ్యాంగ్స్ (ఇంగ్లిష్) – ఫిబ్రవరి 28

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.