The Legend: ఇట్స్ అఫీషియల్! ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’.. ఎక్కడ చూడొచ్చునంటే?

గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ 'ది లెజెండ్' అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

The Legend: ఇట్స్ అఫీషియల్! ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ 'ది లెజెండ్'.. ఎక్కడ చూడొచ్చునంటే?
The Legend
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 03, 2023 | 10:37 AM

గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ ‘ది లెజెండ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దీనికి జే.డీ జెర్రీ దర్శకుడు కాగా, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కథానాయికగా నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడమే కాదు.. నెట్టింట విపరీతమైన ట్రోలింగ్‌ కూడా జరిగింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూశారు. ఇక తాజాగా ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రానికి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని లెజెండ్ శరవణన్ కొద్దిసేపటి క్రితం స్వయంగా ప్రకటించారు.