Alia Bhatt: హాలీవుడ్ మూవీలో క్యూట్ విలన్‏గా అలియా.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ట్రైలర్ చూశారా ?..

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో అలియా కథానాయికగా కాదు. విలన్. యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో ప్రతినాయకురాలిగా కనిపించనుంది. గాడోట్ వర్సెస్ రాచెల్ వార్ నడుస్తుండగానే మధ్యలో మరో కీలకమైన విలన్ కీయా ధావన్ పేరుతో అలియా పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇందులో గాల్ గాడోట్ పాత్ర ఏజెంట్ రాచెల్ స్టోన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది.

Alia Bhatt: హాలీవుడ్ మూవీలో క్యూట్ విలన్‏గా అలియా.. 'హార్ట్ ఆఫ్ స్టోన్' ట్రైలర్ చూశారా ?..
Alia Bhatt
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2023 | 4:57 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. ఇప్పుడు సౌత్ అభిమానులను సంపాదించుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆమెకు దక్షిణాదిలోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పాన్ ఇండియా హీరోయిన్‏గానే కాకుండా.. గ్లోబల్ స్టార్‏గా మారిపోయింది అలియా. ఆమె నటించిన తొలి హాలివుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో అలియా కథానాయికగా కాదు. విలన్. యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో ప్రతినాయకురాలిగా కనిపించనుంది. గాడోట్ వర్సెస్ రాచెల్ వార్ నడుస్తుండగానే మధ్యలో మరో కీలకమైన విలన్ కీయా ధావన్ పేరుతో అలియా పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇందులో గాల్ గాడోట్ పాత్ర ఏజెంట్ రాచెల్ స్టోన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది.

ఈ చిత్రానికి టామ్ హార్పర్ దర్శకత్వం వహించగా.. ఇద్దరు ప్రముఖ మహిళల మధ్య ఉత్కంఠభరితమైన స్టోరీతో రానుంది. ఇందులో కనికరం లేని విలన్ పాత్రలో రేచెల్ కీయా కనిపించనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇందులో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ మెప్పించాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

టామ్ హార్పర్ రూపొందించిన ఈ చిత్రంలో జామీ డోర్నాన్, సోఫీ ఒకోనెడో, మాథియాస్ ష్వీగోఫర్, జింగ్ లూసీ, పాల్ రెడీ ప్రధాన పాత్రలోల నటించారు. ఇందులో గాడోట్, అలియా ముఖ్య పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.