Kranti Movie Review: సరికొత్త మర్డర్ మిస్టరి.. ఆకట్టుకుంటోన్న క్రాంతి

హీరో రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు అయన సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా!! నిఖిల్ 'కిరిక్ పార్టీ', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', సూపర్ ఓవర్ లో సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించారు.

Kranti Movie Review: సరికొత్త మర్డర్ మిస్టరి.. ఆకట్టుకుంటోన్న క్రాంతి
Kranthi
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2023 | 5:28 PM

సినిమా టైటిల్: క్రాంతి

విడుదల తేదీ: మార్చ్ 3 2023

నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యమునా శ్రీనిధి, కార్తిక్, భవాని తదితరులు..

ఎడిటర్: కేసీ హరి

మ్యూజిక్ డైరెక్టర్: గ్యాన్ సింగ్

సినిమాటోగ్రాఫర్: కిషోర్ బొయిదాపు

ప్రొడ్యూజర్: భార్గవ్ మన్నె

బ్యానర్: స్వాతి పిక్చర్స్

డైరెక్టర్: వి భీమ శంకర్

హీరో రాకేందు మౌళి నటుడు మాత్రమే కాదు అయన సింగర్, రైటర్, లిరిసిస్ట్ కూడా!! నిఖిల్ ‘కిరిక్ పార్టీ’, నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’, సూపర్ ఓవర్ లో సపోర్టింగ్ యాక్టర్ గా చేసి మెప్పించారు. అటు హీరో గాను కొన్ని సినిమాలు చేసారు. వి. భీమ శంకర్ దర్శకత్వంలో రాకేందు మౌళి హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రాంతి’. భార్గవ్ మన్నే నిర్మించిన ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీలో ఈ వారం మార్చ్ 3 గ్రాండ్ గా విడుదలైంది.

కథ: ‘రామ్'(రాకేందు మౌళి) ఎప్పుడు చురుగ్గా ఉండే వ్యక్తి. ఫ్యూచర్ లో పోలీస్ కావాలనేదే తన లక్ష్యం. రామ్ ప్రేయసి ‘సంధ్య'(ఇనయా సుల్తానా) తన తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడమని కోరుతుంది. పెళ్లి సంబంధం కోసం బయలుదేరిన రామ్, సంధ్య మృతదేహం చూసి తల్లడిల్లిపోతాడు. ఏడాది తరువాత ‘రామ్ కుటుంబానికి’ తెలిసిన ‘రమ్య’ (శ్రావణి) అమ్మాయి మిస్ అవుతుంది. ఒకప్పుడు రామ్ చేతికి రాఖీ కూడా కట్టింది. అప్పటికి కొంత మంది అమ్మాయిలు కాకినాడలో కనిపించడం లేదని కంప్లైంట్స్ వస్తాయి. ఆ విషయం తెలిసిన రామ్ ఏం చేశాడు? మహిళలు ఎలా మిస్ అవ్వుతున్నారు? ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద మనుషులు ఎవ్వరైనా ఉన్నారా? అనేది మిగతా సినిమా.

కధనం, విశ్లేషణ: గత కొన్ని సంవత్సరాలు నుంచి ఓటీటీలో థిల్లర్ సినిమాలకు ఆదరణ బావుంటోంది. ఎన్ని థిల్లర్ సినిమాలు వచ్చిన సగటు ఆడియెన్ ని మేపించడం అంటే అంత సులభం కాదు. అంతలా, ‘వెబ్ సిరీస్’ లకు అలవాటు పడిన ప్రేక్షకులు ఎల్లప్పుడూ కొత్తదనం ఎక్సపెక్ట్ చేస్తున్నారు. మరి, రాకేందు మౌళి హీరో గా వచ్చిన ఈ ‘థ్రిల్లర్’ సినిమా లో కొత్తదనం ఉందా లేదో తెలుసుకుందాం!!

‘క్రాంతి’ ప్రారంభ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపించినా, ఎప్పుడైతే హీరో రామ్(రాకేందు మౌళి) రమ్య మిస్సింగ్ కేసు ప్రారంబిస్తాడో కథలో వేగం మొదలవుతుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే ‘సెన్సటివ్’ డైలాగ్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ‘కడుపు నొప్పి వస్తే కంగారు పడే మగాడు గొప్పా? పురిటినొప్పులు భరించే ఆడది గొప్పా?’ వంటి డైలాగులు థియేటర్ లో వింటుంటే గూసుబంప్స్ వస్తాయి. ‘క్రాంతి’ సినిమా థ్రిల్లర్ తో పాటు అటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమా ‘క్లైమాక్స్’ లో ఇచ్చే సందేశం బాగుంటుంది.

దర్శకుడు ‘భీమ శంకర్’ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కాకపోతే, పలు సీన్స్ లో బడ్జెట్ పరంగా రాజి పడ్డాడని అనిపిస్తుంది. అయ్యితే మెచ్చుకోవలిసిన విషయం ఏంటి అంటే!! కేవలం ‘9’ రోజుల్లోనే ఇంత క్వాలిటీ ఔట్ ఫుట్ ఇవ్వడం. అలాగే, కొన్ని సీన్స్ లో కాస్త తడబడినట్టు అనిపించిన ఎంతో గ్రిప్పింగ్ కథను చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నటి నటులు పెర్ఫామెన్స్: వెన్నెలకంటి కుమారుడు ‘రాకేందు మౌళి’ రామ్ పాత్రలో తన అనుభవాన్ని స్క్రీన్ మీద ఎంతో చక్కగా కనబరిచారు. ఎక్కడ తడబాటు పడకుండ పూర్తి సంపన్న నటుడు గా మార్కులు కొట్టేసాడు. ‘ఇనయ సుల్తానా’ మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చాలా సాంప్రదాయంగా పక్కింటి అమ్మాయిల పాత్ర గుర్తుండిపోయేలా నటించింది. ‘శ్రావణి శెట్టి’, ‘యమునా శ్రీనిధి’ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

సాంకేతిక విభాగం: తక్కువ ఖర్చులో మంచి ఖ్వాలిటీ అవుట్ ఫుట్ ఇవ్వచ్చు అని ఈ సినిమాతో దర్శకుడు ప్రూవ్ చేసాడు. ‘గ్యాన్ సింగ్’ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్. సినిమాటోగ్రాఫర్ ‘కిషోర్ బొయిదాపు’ విజ్యువల్స్ అందించడంలో పూర్తి స్థాయిలో న్యాయం చేసారు. ‘కేసీ హరి’ అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలకి ఎడిటింగ్ లో పదును పెట్టాలిసింది. ప్రొడక్షన్ ‘వ్యాల్యూస్’ పర్వాలేదు.

బాటమ్ లైన్: సరికొత్త మర్డర్ మిస్టరి ‘క్రాంతి’