Tollywood: ఈ చిన్నోడు కిరీటం లేని యువరాజు.. భారత మాజీ క్రికెటర్ కొడుకు.. ఈ హీరోను గుర్తుపట్టగలరా ?..
ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్స్ చిన్ననాటి పిక్స్ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తోన్న ఆ చిన్నోడు కిరీటం లేని యువరాజు. పాన్ ఇండియా స్టార్.
సోషల్ మీడియా.. అభిమానులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధి. సినిమా అప్డేట్ట్స్ అయినా.. పర్సనల్ విషయాలైనా ఇప్పుడు నెటిజన్లతో పంచుకుంటున్నారు నటీనటులు. ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్, మూవీ ప్రమోషన్స్ హీరోలు ఎక్కువగా షేర్ చేస్తుండగా.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు హీరోయిన్. ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్స్ చిన్ననాటి పిక్స్ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తోన్న ఆ చిన్నోడు కిరీటం లేని యువరాజు. పాన్ ఇండియా స్టార్. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో. అలనాటి హీరోయిన్ తనయుడు. అతని తండ్రి మాజీ క్రికెటర్. ఎవరో గుర్తుపట్టారా ? అతనే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.
బాలీవుడ్ అండస్ట్రీలోని స్టార్ హీరోలలో సైఫ్ ఒకరు. పటౌడీ రాజవంశం నవాబుల యువతరం. భారత మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్.. బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ దంపతుల కుమారుడు. పటౌడీ వంశానికి 10వ నవాబ్. భారతదేశంలోని అత్యంత ధనిక రాజకుటుంబాలలో ఒకటైన పటౌడీ వంశానికి ప్రస్తుత నవాబ్ సైఫ్. హర్యానాలో దాదాపు రూ.5000 కోట్ల ఆస్తులకు సైఫ్ వారసుడు.
కరీనా కపూర్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
1991లో బెఖుడి సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. బెఖుడి సినిమా షూటింగ్ సమయంలో నటి అమృతా సింగ్ ను ప్రేమించారు. 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు.
కరీనా కపూర్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ప్రస్తుతం సైఫ్ దేవర సినిమాలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో సైఫ్ భైరా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
కరీనా కపూర్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.